Guru Vakri 2022: త్వరలో తిరోగమనం చేయనున్న గురుడు.. ఈ 4 రాశులవారికి డబ్బే డబ్బు!

Guru Vakri 2022: త్వరలో గురువు తన సొంత రాశి అయిన మీనంలో తిరోగమనం చేయబోతున్నాడు. తిరోగమన గురువు సంచారం కొన్ని రాశులకు బలమైన ప్రయోజనాలను ఇవ్వనున్నాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 28, 2022, 11:24 AM IST
  • మీనంలో గురుడు తిరోగమనం
  • 4 రాశులవారికి శుభప్రదం
Guru Vakri 2022: త్వరలో తిరోగమనం చేయనున్న గురుడు.. ఈ 4 రాశులవారికి డబ్బే డబ్బు!

Guru Vakri 2022: సంపద మరియు అదృష్టాన్ని ఇచ్చే గ్రహం బృహస్పతి.  గురుడు జూలై 29 నుండి తన సొంత రాశి అయిన మీన రాశిలో తిరోగమనం (Jupiter Retrograde in Pisces 2022) చేయబోతున్నాడు. 2022 ఏప్రిల్ 13న బృహస్పతి మీనరాశిలో ప్రవేశించాడు. బృహస్పతి తిరోగమనం సంచారం వల్ల నాలుగు రాశులవారికి లాభపడనున్నారు. ఆ 4 రాశులేంటో చూద్దాం. 

వృషభం (Taurus): తిరోగమన గురు వృషభ రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. వీరి ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది. భారీ ప్యాకేజీతో కొత్త ఉద్యోగం దొరుకుతుంది లేదా జీతం పెరగవచ్చు. వ్యాపారంలో చాలా లాభాలు ఉంటాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మిథునం (Gemini): మిథున రాశి వారికి తిరోగమన గురువు అనుకూల ఫలితాలు ఇస్తారు. ఒక చిన్న ప్రయత్నం కూడా పెద్ద ప్రయోజనాలను ఇస్తుంది. కెరీర్‌లో ఎవరైనా సహాయం చేస్తారు, ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

కర్కాటకం (Cancer): బృహస్పతి యొక్క తిరోగమన కదలిక కర్కాటక రాశి వారికి అద్భుతమైన సమయాన్ని తెస్తుంది. ఈ సమయం వారికి పదవులు, డబ్బు, ప్రతిష్ట అన్నీ ఇస్తుంది. ఆగిపోయిన ధనం మీకు లభిస్తుంది. నిలిచిపోయిన పని జరుగుతుంది. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది.

కుంభం (Aquarius): మీనరాశిలో కుజుడు తిరోగమనం కుంభ రాశి వారికి లాభాలను ఇస్తుంది. వ్యాపారంలో విజయం ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి కూడా ప్రయోజనం ఉంటుంది. మీరు పెట్టుబడి నుండి మంచి రాబడిని పొందుతారు. కార్యాచరణ పెరుగుతుంది, ఇది మీకు ప్రజాదరణను తెస్తుంది.

Also Read: Garuda Puran: ఎంత కష్టపడి పనిచేసినా మీ చేతిలో డబ్బు నిలవట్లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News