Grah Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా రాశులను ఛేంజ్ చేస్తాయి. శనిదేవుడు తన సొంతరాశి అయిన కుంభరాశిలో జనవరి 17న ప్రవేశించి అక్కడే తిష్టవేశాడు. ఛాయా గ్రహాలైన రాహువు మేషరాశిలోనూ, కేతువు తులరాశిలోనే సంచరిస్తున్నారు. ఏప్రిల్ 22న దేవగురు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. దీనితోపాటు సూర్యుడు, గురు గ్రహాల కలయిక వల్ల నవపంచమ యోగం, బుధుడు-సూర్యుడు సంయోగం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతున్నాయి. ఈ గ్రహాల సంచారం, యోగాల కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో ఆనందం వెల్లివిరియనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
మేషరాశి
బృహస్పతి సంచారం మేషరాశివారికి ఆనందాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీ రాశిచక్రం యొక్క మొదటి ఇంట్లో రాహు, సూర్యుడు, గురు మరియు బుధుల కలయిక జరగబోతోంది. ఈ అరుదైన కలయిక మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. అంతేకాకుండా మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది.
మిథునరాశి
రాహువు, సూర్యుడు, బుధుడు, గురుగ్రహ కలయిక మిథునరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిచక్రంలోని 11వ ఇంట్లో ఈ కూటమి ఏర్పడబోతుంది. దీంతో ఈ రాశివారు స్పెషల్ బెనిఫిట్స్ పొందుతారు. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం లాభిస్తుంది. మీరు ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
మకరరాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ యోగం మకరం యొక్క నాల్గవ ఇంటిలో ఏర్పడబోతోంది. దీంతో మీరు మానసికంగా స్ట్రాంగ్ అవుతారు. ఈసమయంలో ఏదైనా విలువైనది కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది.
సింహరాశి
ఈ నాలుగు గ్రహాల కలయిక సింహరాశి యొక్క తొమ్మిదవ ఇంట్లో జరగబోతోంది. దీంతో వీరికి ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది.
మీనరాశి
ఈ గ్రహాల కూటమి మీనం యొక్క రెండవ ఇంటిలో ఏర్పడబోతోంది. దీంతో ఈ రాశివారు ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు.
Also Read: Guru Uday 2023: 'హన్స్ రాజయోగం' చేస్తున్న గురుడు... ఈరాశులకు మంచి రోజులు మెుదలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.