Sriramanavami: ఇవాళ శ్రీరామనవమి. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరాముని పవిత్ర ఆలయం భద్రాచలం. అందుకే మరి కాస్సేపట్లో అక్కడ అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం జరగనుంది. ఆ విశేషాలు ఇవే..
భద్రాచలం శ్రీరాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. మరి కాస్సేపట్లో సీతారాముల కళ్యాణోత్సవం కూడా జరగనుంది. మిధిలా స్టేడియంలో జరగనున్న కళ్యాణోత్సవానికి భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు. ఆ విశేషాలు ఎప్పుడు ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం..
ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకూ శ్రీరామునికి ధ్రువమూర్తుల తిరుకళ్యాణం ఉంటుంది. అనంతరం 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకూ ఉత్సవమూర్తులకు అలంకారం ఉంటుంది. 9 గంటల 30 నిమిషాల్నించి 10 గంటల 30 నిమిషాల వరకూ సీతారామ ఉత్సవమూర్తుల ఊరేగింపు ఉంటుంది. 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకూ కళ్యాణ మండపంలో సీతారాముల తిరు కళ్యాణం ఉంటుంది. ఆ తరువాత మద్యాహ్నం 12 గంటల 30 నిమిషాల్నించి 1 గంట వరకూ ఉత్సవమూర్తుల్ని కళ్యాణమండపం నుంచి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. 1 గంట నుంచి మద్యహ్మిక ఆరాధన రాజభోగం ఉంటుంది.
మద్యాహ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్న సముహూర్తాన జరిగే కళ్యాణాన్ని వీక్షించేందుకు తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గడ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్నించి భారీగా భక్తులు తరలివస్తారు. నిన్న అంటే శనివారం రాత్రి రామాలయ ప్రాంగణంలో ఎదుర్కోలు ఉత్సరవం, గరుడ సేవ కన్నుల పండువగా జరిగాయి. ఉత్తర ద్వారం వద్ద అఖిలాండ కోటి బ్రహ్మాండనాయుడికి ఎదుర్కోలు బ్రహ్మోత్సవం ఘనంగా జరిగింది.
Also read: Coconuts Astrological Benefits: కొబ్బరికాయతో ఇలా చేస్తే తప్పక దైవ అనుగ్రహం సిద్ధిస్తుంది...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook