Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్ఠమి సమీపిస్తోంది. ఇప్పట్నించే సంబరాల ఏర్పాట్లు, పూజా కార్యక్రమాలు ప్రారంభమౌతున్నాయి. ఏ పూజా వస్తువులు సిద్ఘంగా ఉంచుకోవాలనేది పరిశీలిద్దాం..
ఆగస్టు 18న శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది. శ్రీకృష్ణుడి భక్తులు ఇప్పట్నించే జన్మాష్టమి కోసం నిరీక్షిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 18న జన్మాష్టమి సందర్భంగా వ్రతం ఆచరించేవాళ్లు, పూజలు చేసేవాళ్లు సన్నాహాలు ప్రారంభించేశారు. పూజకు ఏ వస్తువులు అవసరమో సిద్ఘంగా ఉంచుకోవాలి. ఈ నేపధ్యంలో పూజకు ఏవి సిద్ధంగా ఉంచుకోవాలో తెలుసుకుందాం...
జన్మాష్టమి పూజకు అవసరమైన సామగ్రి ఇదే
ధూప బత్తీలు, అగర్ బత్తీ, కర్పూరం, కేసరి, చందనం, సింధూరం, వక్కపొడి, పాన్ ఆకులు, పూలదండ, తులసీమాల, ధనియాలు, కుంకుమ, అక్షింతలు, గులాల్, అభ్రకం, పసుపు, ఆభూషణం, నాడా , దూది, గంగాజలం, తేనె, పంచదార, తులసీ ఆకులు, స్వచ్ఛమైన నెయ్యి, పెరుగు, పాలు, నైవేద్యం, ఇలాచీ, లవంగాలు, అత్తరు, ఆరటి ఆకులు, శీకృష్ణుడి బొమ్మ లేదా చిత్రపటం, తెల్లటి వస్త్రం, ఎర్రటి వస్త్రం, దీపం, నూనె, తాంబూలం, బియ్యం, గోధుమలు, పండ్లు, పూలు అవసరమౌతాయి.
జన్మాష్టమి తిధి ఆగస్టు 18 వతేదీ సాయంత్రం గంటల 21 నిమిషాలకు ప్రారంభమై..ఆగస్టు 19వ తేదీ రాత్రి 10 గంటల 59 నిమిషాలకు పూర్తవుతుంది. జన్మాష్టమి రోజున దేవకి, వాసుదేవుడు, బలరాముడు నందుడు, యశోద, లక్ష్మీదేవి పేరుతో పూజ ప్రారంభించాలి. ఆ రోజున విష్ణు పురాణం, భగవద్గీత తప్పకుండా చదవాలి. పూజ తరువాత ప్రసాదం పంచిపెట్టాలి.
Also read: Rushi Panchami 2022: ఋషి పంచమి పండుగ ఎప్పుడు? దీనిని ఎందుకు జరుపుకుంటారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook