Mercury and Sun are going to meet in Aries on 14th April 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాలు పర్టికలర్ టైం తర్వాత తమ స్థానాలను మార్చుకుంటాయి. ఏప్రిల్ 14న సూర్యుడు మీన రాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం మెర్క్యూరీ మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా అరుదైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీనిని ఆస్ట్రాలజీలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. సూర్యుడు మరియు బుధుడు కలయిక వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
మేషరాశి
సూర్యుడు మరియు శుక్రుడి కలయిక మేషరాశి వారికి ప్రయోజనాలను ఇస్తుంది. మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలు ఆశించే అభ్యర్థులకు అనుకూలమైన సమయం. మీకు వివాహం కుదిరే అవకాశం ఉంది. మీరు రుణ విముక్తి నుండి బయటపడతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఇది అనుకూలమైన సమయం. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.
సింహ రాశి
బుధాదిత్య యోగం సింహరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. మీరు పని ప్రదేశంలో ప్రశంసలు పొందుతారు. మీరు మీ పై అధికారుల నుండి అభినందనలు పొందుతారు. కోర్టు వ్యాజ్యాలలో విజయం సాధిస్తారు. మీరు భారీగా డబ్బును సంపాదిస్తారు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని జీ న్యూస్ ధృవీకరించలేదు.)
Also Read: Rajyog: హనుమాన్ జయంతి నాడు 'శక్తివంతమైన రాజయోగం'.. ఈ 4 రాశులపై కనక వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి