Sri Rama Navami 2023: శ్రీరామనవమి రోజున ఈ రాశులకు మహార్దశ.. ఇందులో మీరున్నారా?

Ram Navami 2023: ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్షంలో శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. ఈరోజున కొన్ని రాశులవారికి లక్ కలిసి రానుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2023, 09:46 AM IST
Sri Rama Navami 2023: శ్రీరామనవమి రోజున ఈ రాశులకు మహార్దశ.. ఇందులో మీరున్నారా?

Sri Rama Navami 2023: దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలలో శ్రీరామనవమి ఒకటి. ఈ ఫెస్టివల్ ను ప్రతి ఏటా చైత్ర మాసంలో శుక్ల పక్షంలో జరుపుకుంటారు. ఈ వేడుక ఈ ఏడాది మార్చి 30న వస్తుంది. అయితే ఈ పండుగ నాడు కొన్ని రాశులవారికి అదృష్టం పట్టనుంది. అంతేకాకుండా ఇదే రోజు కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడుతున్న కారణంగా కొందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

శ్రీరామనవమి ఈ రాశులకు ప్రత్యేకం
మేషం: ఈ నెల చివరిలో ఏర్పడబోయే శ్రీరామనవమి మేషరాశివారికి మంచి బెనిఫిట్స్ ను ఇస్తుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. 
వృషభం : శ్రీరామ నవమి నాడు వీరు చేపట్టే ఏ పని అయినా విజయవంతం అవుతుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. ఏదైనా కొత్త పని లేదా వ్యాపారం స్టార్ట్ చేయడానికి ఇదే అనుకూల సమయం.
సింహం: రాములోరి పండుగ సింహరాశివారికి మంచి ఫలితాలను ఇస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. 
ధనస్సు: శ్రీరామనవమి రోజున మీరు భారీగా ఆస్తిని కొనుగోలు చేస్తారు. మీకు సమాజంలో గౌరవం దక్కుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
తుల: ఈ రాశి వారు శ్రీరామనవమి రోజున శుభవార్తలు వింటారు. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు.  

Also Read: Trigrahi Yogam: ఒకే రాశిలో మూడు గ్రహాల 'మహా సంగమం'.. ఈ రాశులకు తిరుగులేనంత ధనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News