Ruchak Rajyog 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అంగారక గ్రహాన్ని ధైర్యం, వివాహానికి సూచిగా పరిగణిస్తారు. అయితే ఈ గ్రహం మే 31వ తేదిన మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. దీంతో జూన్ ఈ గ్రహ ప్రభావం పెరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన రుచక రాజయోగం ఏర్పడబోతోంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారు జూన్ నెలలో విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ రుచక యోగ ప్రభావం దాదాపు జూలై 12 తేది వరకు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అంగారక గ్రహం సంచారం చేయడం వల్ల ఏర్పడే దాని ప్రభావం జూన్ 1 మధ్యాహ్నం 3:51 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన 'రుచక రాజ్యయోగం' ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలిగితే మరికొన్ని రాశులవారికి ధైర్యం పెరిగే చాన్స్ ఉంది.
మేష రాశి:
రుచక రాజయోగంతో మేష రాశివారు ప్రభావితమవుతారు. దీని కారణంగా ఈ సమయంలో సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. అలాగే వీరికి ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. అలాగే వీరికి ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ సమయంలో కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా ఒంటరి జీవితం గడుపుతున్నవారికి వివాహ ప్రతిపాదనలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. దీంతో పాటు కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి.
వృషభ రాశి:
వృషభ రాశివారిపై కూడా ఈ ప్రత్యేక యోగం ప్రభావం పడబోతోంది. దీని కారణంగా వీరు ఎప్పుడు పొందలేని లాభాలు పొందబోతున్నారు. అంతేకాకుండా ప్రయాణాలు చేసేవారికి ఆహ్లాదకరమైన వాతావరణంగా కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వీరు కొత్త ఆస్తులు కూడా కొనుగోలు చేసే సామార్థ్యాన్ని పొందుతారు. అంతేకాకుండా ఎలాంటి పనుల్లో పెట్టుబడులు పెట్టిన విపరీతమైన ధన లాభాలు పొందుతారు. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో విదేశాలకు కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. కుటుంబ జీవితంలో ఒడిదులుకులు కూడా సులభంగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారాల్లో ఆపారమైన విజయాలు సాధిస్తారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మిథునరాశి:
మిథునరాశికి రుచక రాజయోగంతో జూన్ నెలలో విపరీతమైన లాభాలు కలిగే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసేవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఉన్న విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు అనారోగ్య సమస్యల నుంచి కూడా వీరికి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా పిల్లల నుంచి కూడా ఈ సమయంలో శుభవార్తలు వింటారు. అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరు శుభవార్తలు వినే ఛాన్స్ కూడా ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి