Surya and Shani made Samsaptak Yoga: ఈ నెలలో ప్రధాన గ్రహాలైన శని మరియు సూర్యుడు తమ రాశులను మార్చాయి. ఐదు రోజుల వ్యవధిలో ఈ రెండు గ్రహాలు తమ స్థానాన్ని చేంజ్ చేశాయి. ప్రస్తుతం శని మకరరాశిలో ఉండగా, సూర్యభగనానుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి ఏడవ ఇంట్లో కూర్చున్నాయి. దీంతో సంసప్తక యోగం (Samsaptak Yogam) ఏర్పడింది. దీని ప్రభావ 4 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
ఈ రాశులపై సంసప్తక యోగం ప్రభావం
మిథున రాశి (Gemin): ఈ రాశివారికి సంసప్తక యోగం చాలా మేలు చేస్తుంది. ఆర్థికంగా లాభం పొందుతారు. శాలరీ పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు లాభపడతారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం.
కర్కాటకం (Cancer)- కర్కాటక రాశి వారికి సంసప్తక యోగం వల్ల ఆదాయం పెరుగుతుంది. కొత్త జాబ్ రావచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఇది మంచి సమయం.
తుల (Libra)- ఈ రాశి వారికి కొత్త జాబ్ వస్తుంది. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ సమయం కెరీర్‌కు చాలా బాగుంటుంది. వ్యాపారస్తులు లాభపడతారు.
మీన రాశి (Pisces) - శని, సూర్య స్థానం వల్ల ఏర్పడిన సంసప్తక యోగము మీనరాశి వారికి ఫలప్రదంగా ఉంటుంది. వీరు కెరీర్‌లో విజయం సాధిస్తారు. ఫ్రెషర్స్ ఉద్యోగాలు పొందుతారు. ఈ రాశివారు కొన్ని శుభవార్తలు ఉంటారు.
Also Read: Guru Vakri 2022: మీనంలో బృహస్పతి తిరోగమనం.. ఈ 3 రాశులవారికి కష్టకాలం..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook