Saturn Transit 2022: ఒక్కసారి 'శని' పట్టిందంటే దానివల్ల కలిగే నష్టాలు అన్నీ ఇన్నీ కావు. కాబట్టి శని ప్రభావం ఉన్నవారు దోష పరిహారంతో దాని నుంచి బయటపడాలని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ఈ నెల 29న శని గ్రహం రాశిచక్రం మారనుంది. శని కుంభ రాశిలోకి ప్రవేశిస్తున్నందునా కొన్ని రాశులపై అది చెడు ప్రభావం చూపించనుంది. శని రాశి సంచారంతో ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే అవకాశం ఉండగా... మీన రాశి వారికి చెడు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శని ప్రభావం నుంచి బయటపడేందుకు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
ఏడేళ్ల వరకు 'శని' ప్రభావం :
రెండున్నరేళ్ల తర్వాత తొలిసారి శని గ్రహం రాశి మారుతున్నట్లు చెబుతున్నారు. దీని ప్రభావంతో మీన రాశి వారిపై ఏడేళ్ల పాటు దాని చెడు ప్రభావం ఉంటుందని అంటున్నారు. దీంతో కష్టాలు, నష్టాలు, బాధలు వారిని వెంటాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నుంచి బయటపడేందుకు కొన్ని పరిహారాలను నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా చేస్తే పరిహారం :
కర్మానుసారం మీన రాశి వారిపై శని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. భిక్ష ఇవ్వడం, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి, కష్టపడి పనిచేసే వ్యక్తులకు సహాయం చేయడం ద్వారా ఆ ప్రభావం నుంచి బయటపడవచ్చునని సూచిస్తున్నారు. ఇలా చేస్తే శని దేవుడు సంతోషిస్తాడని చెబుతున్నారు.
- శని ప్రభావం ఉన్నవారు శనివారం నాడు ఒక పేదవాడికి నల్ల గుడ్డ, నల్ల నువ్వులు, నల్ల శనగలు వంటి నల్లటి వస్తువులను దానం చేయాలి.
- కార్మికులు, మహిళలు, దివ్యాంగులకు సహాయం చేస్తే మంచిది. పొరపాటున కూడా వారిని అవమానించవద్దు.
ప్రతీ శనివారం రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించడం చాలా మంచిది. దీనివల్ల అనేక సమస్యలు తొలగిపోయి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది.
- శనివారం రోజున కొన్ని దైవ మంత్రాలను పఠించడం వల్ల మీలో సానుకూలత పెరుగుతుంది. అదే సమయంలో శని ప్రభావం తొలుగుతుంది.
శనీశ్వరుని ఆగ్రహానికి లోనైనవారు హనుమంతుడిని ఆశ్రయించడం ఉత్తమ మార్గం. దీని కోసం శనివారం నాడు హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ చదవాలి. పేదలకు ఏదైనా దానం చేయాలి
(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Portable Air Conditioner: అమెజాన్ బంపరాఫర్.. రూ.1949కే పోర్టబుల్ మినీ ఏసీ..
OnePlus New Model: OnePlus ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.20 కంటే తక్కువ ధరకే 5G మొబైల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook