Saturn Rising 2024: త్వరలో ఉదయించబోతున్న శని.. ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..

Saturn Rising 2024: త్వరలో శనిదేవుడు గమనంలో పెను మార్పులు రాబోతున్నాయి. మార్చి 18న శని గ్రహం కుంభరాశిలో ఉదయించబోతుంది. దీంతో మూడు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందబోతున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2024, 04:44 PM IST
Saturn Rising 2024: త్వరలో ఉదయించబోతున్న శని.. ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..

Shani uday in March 2024: గ్రహాలు సూర్యుడి దగ్గరగా వచ్చినప్పుడు అస్తమించడం జరుగుతుంది.  అస్తమయ సమయంలో ప్రతి గ్రహం బలహీనంగా ఉంటుంది. దీంతో అవి ప్రతికూల ప్రభావాలను ఇస్తాయి. కర్మఫలదాత అయిన శనిదేవుడు మార్చి 17 వరకు అస్తమయంలో ఉండి.. మార్చి 18న కుంభరాశిలో ఉదయించబోతుంది. గ్రహోదయం ఏయే రాశుల వారి జీవితాల్లో వెలుగులు నింపనుందో తెలుసుకుందాం. 

ధనుస్సు: శనిదేవుడి పెరుగుదల ధనస్సు రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీకు ప్రమోషన్ రావడంతోపాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. మీ కెరీర్ లో గ్రోత్ ఉంటుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుతుంది. మీరు ఈ సమయంలో శుభవార్త వినే అవకాశం ఉంది. మీ దారిద్ర్యం తొలగిపోతుంది. 
వృషభం: శనిదేవుడి ఉదయం వృషభరాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. మీ కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది. మీరు ఉద్యోగ మరియు వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. మీరు ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. 

Also Read: Magh Purnima 2024: మాఘ పూర్ణిమ రోజు ఇలా చేస్తే.. మీ కోరికలు నెరవేరడం ఖాయం..

తుల: శనిగ్రహం ఉదయించడం వల్ల తులారాశి వారికి తులరాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 

Also Read: Sun Transit 2024: శని పాలించే రాశిలోకి సూర్య గ్రహం.. 4 రాశులవారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News