Venus Planet Made Kendra Trikon Rajyog: వేద జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు.. సంపద, వైభవం మరియు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. అందువల్ల శుక్ర గ్రహం సంచారం చేసినప్పుడు.. అది అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం శుక్రుడు తన సొంత రాశి అయిన తులరాశిలో సంచరిస్తున్నాడు. అంతేకాకుండా కేంద్రత్రికోణ రాజయోగాన్ని (Venus Planet Made Kendra Tirkon Rajyog) కూడా ఏర్పరుస్తున్నాడు. ఈ యోగం మూడు రాశులవారికి వృత్తిలో పురోభివృద్ధి, వ్యాపారంలో మంచి లాభాలను ఇస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేషం (Aries): శుక్రుని సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ సంచార జాతకంలో ఏడవ ఇంట్లో సంచరించింది. ఇది వైవాహిక జీవితం మరియు భాగస్వామ్య ప్రదేశంగా పిలువబడుతుంది. దీంతో మీ వైవాహిక జీవితం సూపర్ ఉంటుంది. మీరు భాగస్వామ్యంతో చేసే పనుల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. పెళ్లికాని యువతీయువకులకు వివాహ ప్రతిపాదన రావచ్చు. ఈ సమయంలో మీరు జెర్కిన్ రాయిని ధరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
కర్కాటకం (Cancer): మీ సంచార జాతకంలో నాల్గవ ఇంట్లో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతోంది. అందువల్ల ఈ సమయంలో మీరు భౌతిక ఆనందాలను పొందవచ్చు. మీ తల్లితో సంబంధాలు కూడా మంచిగా ఉంటాయి. మీరు ఏదైనా వాహనం మరియు ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వివిధ వనరులు నుండి డబ్బును సంపాదిస్తారు.
సింహం (Leo): శుక్రుని సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో శుక్రుడు మూడవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీంతో మీ ధైర్యం మరియు శక్తి పెరుగుతాయి. ఈ సమయంలో మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసుల్లో గెలుపొందుతారు. ఇంట్లో మతపరమైన కార్యక్రమం జరిగే అవకాశం ఉంది.
Also Read: Shukra Gochar 2022: త్వరలో ధనుస్సు రాశిలోకి శుక్రుడు... వీరి అదృష్టం మారుతుంది చూడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook