Sun Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఫలితంగా అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశులపై కీలకంగా ఉండనుంది. ఈ నెలలో శక్తివంతమైన గ్రహాలు గోచారం చేయనున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
గ్రహాల రాజుగా భావించే సూర్యుడు త్వరలో అంటే నవంబర్ 17న వృశ్చిక రాశిలో ప్రవేశించనున్నాడు. సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రవేశించడం వల్ల 4 రాశులపై అత్యంత శుభ పరిణామాలు కలగనున్నాయి. ఈ నాలుగు రాశులవారికి అంతులేని ధన సంపదలు, అభివృద్ధి ఉంటుంది. సూర్యుడు ఏ రాశిలో అయినా నెలరోజులే ఉంటాడు. సూర్యుడి వృశ్చిక రాశి గోచారం కారణంగా ఏయే రాశులకు ప్రయోజనాలు కలగనున్నాయో పరిశీలిద్దాం..
సూర్యుడు ఇదే రాశిలో గోచారం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు అదృష్టం మారిపోనుంది. కొత్త వ్యాపారాలు తెర్చుకునే అవకాశముంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు అంతులేని లాభాలుంటాయి. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశముంటుంది. విదేశీయానం ఉంటుంది. జీవితంలో మీరు ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు.
ఇక మకర రాశి జాతకులకు ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పదోన్నతి లభిస్తుంది. ఇంక్రిమెంట్లు రావడంతో ఆర్దికంగా బాగుంటుంది. ఆదాయమార్గాలు పెరుగుతాయి.వ్యాపారులు విశేషమైన లాభాలు ఆర్జిస్తారు. కెరీర్ లో పదోన్నతి ఉంటుంది. వ్యాపారం బాగుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలనిస్తాయి.
వృషభ రాశి జాతకులకు సూర్యుడి గోచారం అత్యంత శుభప్రదంగా ఉండనుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగులకు పనిచేసే చోట గౌరవముంటుది. పదోన్నతి , ఇంక్రిమెంట్లు ప్రోత్సాహాన్నిస్తాయి. ఊహించని విధంగా ధనలాభం కలగవచ్చు. దాంతోపాటు ప్రతినెలా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బ్రహ్మచారులుగా ఉన్నవారికి శుభవార్త, పెళ్లి నిశ్చయమౌతుంది. ఆర్ధికంగా ఎలాంటి సమస్యలు ఉండవు. ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
సూర్యుడి గోచారం కారణంగా సింహ రాశి జాతకులకు అంతా అనుకూలమైన పరిణామాలే కలుగుతాయి. కొత్త వాహనం లేదా కొత్త ఇళ్లు కొనుగోలు చేసే అవకాశముంది. కెరీర్ ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. ఎప్పట్నించో ఉన్న కోరికలు పూర్తి కావచ్చు. అంతులేని ధనలాభం కలగనుంది. వ్యాపారులకు మంచి లాభాలుంటాయి. ఉద్యోగులకు గౌరవంతో పాటు వేతనం కూడా పెరుగుతుంది. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు.
Also read: Govardhan Puja 2023: గోవర్ధన పూజ ఎప్పుడు?, ఈ పూజా ప్రత్యేకత ఏమిటి, పూజా ప్రత్యేక సమయాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook