Pregnancy : ఈరోజే పవర్ఫుల్ చంద్రగ్రహణం.. గర్భిణీ స్త్రీలు తప్పక ఇవి పాటించండి

Pregnant Ladies : విశ్వంలో ఈ ఏడాది రాబోతున్న చంద్రగ్రహణం అక్టోబర్ 28న అంటే ఇవాళ అర్ధరాత్రి సమయంలో ఉంటుంది. మిగతా వారి కంటే గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి గ్రహణం గురించి ముందుగానే తెలుసుకొని తగిన నియమాలను పాటిస్తే గ్రహణం యొక్క దుష్ప్రభావం గర్భిణీ స్త్రీల మీద కానీ కడుపులో ఉన్న శిశువు మీద కానీ ఉండదు. కాబట్టి ఈరోజు పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2023, 11:56 AM IST
Pregnancy : ఈరోజే పవర్ఫుల్ చంద్రగ్రహణం.. గర్భిణీ స్త్రీలు తప్పక ఇవి పాటించండి

Lunar Eclipse : ఈ ఏడాది అంటే 2023లో చంద్రగ్రహణం రోజు రానే వచ్చింది. చంద్ర గ్రహణం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆరోజు పాటించాల్సిన నియమాల గురించి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చంద్ర గ్రహణం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా వారితో పోలిస్తే గర్భిణీ స్త్రీలు ఇంకా ఎక్కువ నియమాలను పాటించాల్సి ఉంటుంది. 

ఒక్కో దేశంలో చంద్ర గ్రహణం సమయం ఒక్కోలా ఉంటుంది. తూర్పు అమెరికాలో చంద్రోదయం మరియు ఆస్ట్రేలియాలో చంద్రుడు అస్తమించడంతో గ్రహణం ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం కడుపుతో ఉన్నవాళ్లు జ్యోతిష్యం ప్రకారం కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ ఏడాది గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన సూతక నియమాల గురించి ఇప్పుడు చూద్దాం.

చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు. ఇంటి లోపల ఉండాలి. గ్రహణం సమయంలో నిద్ర పోకుండా దేవుడి మంత్రాలను పటిస్తూ ఉంటే మంచిది. గ్రహణం సమయంలో ఎలాంటి వంటకాలనీ ఇంటికి సంబంధించిన కార్యకలాపాలు కానీ చేయకూడదు. గ్రహణం సమయంలో ఎలాంటి ఆహారం కూడా తినకూడదు. 

గ్రహణం సమయంలో గది తలుపులు మరియు కిటికీలు మూసివేసి, కుదిరితే కిటికీలను ఏదైనా గుడ్డతో కప్పి చంద్ర కిరణాలు లోపలికి రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. గ్రహణం పూర్తయ్యాక ఇంటిని మొత్తం శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా మిగతావారు కూడా గ్రహణం సమయంలో మొక్కలకి నీళ్లు పోయరాదు. ముఖ్యంగా తులసి మొక్కకి గ్రహణం సమయంలో నీరు అందించకూడదు.

ఈ ఏడాది చంద్రగ్రహణం రాత్రి 11:32 నిమిషాలకి మొదలవుతుంది. అప్పటినుంచి మళ్లీ తెల్లవారుజామున 3:26 నిమిషాల వరకు ఉంటుంది. అమెరికాలో గ్రహణం రాత్రి 8:40 నుంచి తెల్లవారుజామున నాలుగింటి వరకు ఉంటుంది. ఈ నాలుగైదు గంటల సమయం చాలా కీలకం. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు పైన చెప్పిన విధంగా నియమాలను పాటించాల్సి ఉంటుంది. 

ఒక్కో దేశంలో గ్రహణం సమయం ఒక్కోలా ఉండటంతో వారి దేశంలో గ్రహణ సమయం గురించి తెలుసుకొని ఆ సమయంలో నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఇక గర్భిణీ స్త్రీలు కాకుండా ఆ మిగతావారు చంద్ర గ్రహణాన్ని ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. గ్రహణం సమయంలో టెర్రర్స్ లేదా ఓపెన్ గ్రౌండ్కి వెళ్లి చంద్రుడిని ఎటువంటి కళ్లద్దాలు లేకుండా చూడొచ్చు.

Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు   

Also Read: 7th Pay Commission: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్.. భారీగా జీతాలు పెంపు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News