Vasu Tips for Money: ఈ 6 వాస్తు టిప్స్ పాటిస్తే మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు...

Vasu Tips for Money: మీరు ఎంత ప్రయత్నించినా మీ చేతుల్లోకి వచ్చిన డబ్బు.. వచ్చినట్లే వచ్చి అలా మాయమవుతోందా... అయితే ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 07:42 PM IST
  • మీ చేతుల్లోకి వచ్చిన డబ్బు వచ్చినట్లే మాయమవుతోందా
  • అలా వచ్చిందో లేదో మరుక్షణం ఇతరుల చేతుల్లోకి వెళ్తోందా
  • అయితే ఈ చిట్కాలు పాటిస్తే మీ ఇంటి నుంచి ధనం బయటకు వెళ్లడం ఆగుతుంది
  • మీ ఇంట్లో సంపద పెరుగుతుంది... ఆ చిట్కాలేంటో తెలుసుకోండి
Vasu Tips for Money: ఈ 6 వాస్తు టిప్స్ పాటిస్తే మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు...

Vasu Tips for Money: కొంతమంది చాలా కష్టపడి డబ్బు సంపాదిస్తుంటారు. సంపాదన మార్గాలకు కొదువ ఉండదు. కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లే మాయమవుతుంటుంది. ఏదో ఒక రూపంలో అది ఇతరుల చేతుల్లోకి వెళ్తుంది. దీనికి కారణం.. ఒక మనిషికి కష్టపడే తత్వంతో పాటు అదృష్టం కూడా అవసరమే. అందుకే కష్టానికి తోడు ఆవగింజంత అదృష్టం ఉంటే మనుషులు ఎక్కడికో ఎదుగుతారని సినిమాల్లో అంటుంటే వింటుంటాం. అయితే ఈ అదృష్టం ఎలా వస్తుంది... అదృష్టానికి మరో పేరుగా భావించే లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి. ఇందుకోసం వాస్తు శాస్త్రంలో కొన్ని చిట్కాలు సూచించబడ్డాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం... 

ఈ చిట్కాలు పాటిస్తే అదృష్టం మీ వెంటే :

కుబేర్ యంత్ర :

వాస్తు శాస్త్రంలో కుబేర యంత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది ఇంట్లో ఉంటే ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఆ ఇంట్లో డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు. కాబట్టి దీన్ని ఇంట్లోని కబోర్డ్‌లో ఉంచితే శుభం జరుగుతుంది. దీనితో పాటు శ్రీ యంత్రాన్ని కూడా ఉంచితే మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

తామర పుష్పం : 

లక్ష్మీ దేవికి తామర పుష్పం అత్యంత ప్రీతిపాత్రమైనది. కాబట్టి లక్ష్మీ దేవిని పూజించేటప్పుడు తామర పుష్పాలు సమర్పించండి. అలాగే, ఇంట్లోని ఏదేని ప్రదేశంలో తామర పుష్పాన్ని ఉంచడం సకల శుభాలను కలగజేస్తుంది. తామర పుష్పం ఉండే ఇంట్లోకి లక్ష్మీ దేవి నడిచొస్తుందని విశ్వసిస్తారు. అయితే ఎప్పటికప్పుడు తాజా తామర పుష్పాలనే ఇంట్లో ఉంచుకోవాలి. వాడిపోయిన వాటిని తీసివేయాలి.

పసుపు కొమ్ము :

ఒక పసుపు కొమ్మును ఎర్రని లేదా పచ్చని వస్త్రంలో కట్టి ఇంట్లోని ఒక ప్రదేశంలో భద్రపరచండి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పసుపు ఉన్న చోట లక్ష్మీ దేవి ఉంటుందని గుర్తించండి. ఆ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.

భోజ్‌పత్ర : 

మొదట కొంత నీటిలో గంధం చెక్కను కరగదీయండి. ఆ తర్వాత నెమలీక కొనను అందులో ముంచి... భోజ్‌పత్రపై 'శ్రీ' అని రాయండి. ఆ ఆకు విరిగిపోనిదై ఉండాలి. ఆ తర్వాత దాన్ని కబోర్డులో ఉంచండి. 

అద్దం : 

ఇంట్లో అద్దాన్ని ఉత్తర దిశగానే ఉంచాలి. లేదంటే, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అద్దాన్ని సరైన దిశలో ఉంచడం ద్వారా ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.

ఎరుపు వస్త్రం :

లక్ష్మీ దేవికి ఎరుపు వస్త్రం చాలా ఇష్టమైనది. కాబట్టి ఇంట్లోని కబోర్టులో ఎరుపు వస్త్రాన్ని ఉంచినట్లయితే అది చాలా శుభాలను కలగజేస్తుంది. ఆదాయం పెరిగేలా చేస్తుంది. 

Also Read: Warangal Tractor Accident: వరంగల్‌లో ఘోర విషాదం... ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురు దర్మరణం...   

Also Read: Rajyasabha Kcr: జగన్ బాటలో కేసీఆర్.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

 

Trending News