Vastu Tips In Telugu: ప్రతి ఒక్కరి ఇళ్లలో గాజు గ్లాసులో ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ముఖాన్ని చూసుకునేందుకు గాజు అద్దాలు కూడా ఉంటాయి. గాజు వస్తువులు లేని ఇల్లు మాత్రం ఎక్కడ ఉండదు. అయితే అప్పుడప్పుడు ఈ గాజు వస్తువులు పగిలిపోతూ ఉంటాయి. చాలామంది ఇల్లులు వీటిని శుభ్రం చేసే క్రమంలో అప్పుడప్పుడు కిందపడి పగిలిపోతాయి. ఇలా పగిలిపోయినప్పుడు చాలామంది గాజు ముక్కలను వెంటనే క్లీన్ చేసేందుకు ఇష్టపడరు. కొంతమంది అయితే క్లీన్ చేసినప్పటికీ కొన్ని గాజు ముక్కలను అక్కడక్కడ వదిలేస్తూ ఉంటారు. ఇంట్లో అద్దాలు పగలడం గురించి వాస్తు శాస్త్రం ఎంతో క్లుప్తంగా వివరించింది. అయితే గాజు తయారుచేసిన వస్తువులు పగిలిపోవడం వల్ల వాస్తు శాస్త్రం ప్రకారం, ఏం జరుగుతుందో? ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోండి.
గాజు వస్తువులు పగిలిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే.?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని సందర్భాల్లో గాజు వస్తువులు పగిలిపోవడం చాలా శుభ్రమట. గాజులో ఏవో తెలియని శక్తిలు ఉంటాయి. కాబట్టి గాజు వస్తువులు పగిలినప్పుడు మీకు కొన్ని సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా గాజును వాస్తు శాస్త్రము ప్రకారం సంక్షోభంగా కూడా పరిగణిస్తారు అయితే ఇది పగిలినప్పుడు మీ ఇంట్లో ఉండే సంక్షోభం తొలగిపోతుందని కూడా అర్థంగా భావిస్తారు. ఇది ఏమైనా ఇంట్లో గాజు వస్తువులు పగలడం శుభ సూచికగానే భావిస్తారు.
అయితే ఇంట్లో పగిలిన గాజు వస్తువుల ముక్కలను వెంటనే శుభ్రం చేయడం చాలా మంచిదని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. గాజు పగలడం శుభపరిణామంగా పరిగణించినప్పటికీ పగిలిన గాజు ముక్కల విషయంలో వాస్తు శాస్త్రం కొన్ని ప్రత్యేకమైన అర్థాలను అందించింది. ఇంట్లో పగిలిపోయిన గాజు ముక్కలు ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తి కూడా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గాజు పగిలిన వెంటనే ఇంట్లో నుంచి బయటపడేయడం చాలా మంచిదని వాస్తు శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. పగిలిన గాజు ముక్కలను ఉంచుకోవడం వల్ల అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఇంట్లో ఉంచుకోకపోవడం చాలా మంచిది.
గాజు పలగడం వల్ల కలిగే లాభాలు:
ఇంట్లోని కిటికీల అద్దాలు వాటికవే పగలడం వల్ల తప్పకుండా శుభవార్తలు వింటారు. దీంతోపాటు డబ్బుకు సంబంధించిన విషయాల్లో పురోగతి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆగిపోయిన పనులు కూడా జరిగిపోతాయి.
అకస్మాత్తుగా గాజు లేదా అద్దం పగలడం వల్ల ఇంట్లో వస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా కుటుంబంలో శాంతి వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద వివాదాల నుంచి పరిష్కారం లభిస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ముఖ్యంగా ఏవైనా గాజు వస్తువులు పగలడం వల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి సులభంగా పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా త్వరగా కోలుకునే అవకాశాలు కూడా ఉన్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
ఇంట్లో అద్దాలు పగడం వల్ల కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. అంతే కాకుండా త్వరలోనే ఫ్యామిలీ కూడా గుడ్ న్యూస్ ఉంటారు.
ఇంట్లో పదేపదే గాజు వదలడం వల్ల ఏదైనా పెద్ద విపత్తు నుంచి పరిష్కారం లభించబోతుందని అర్థం. అంతే కాకుండా ఇది దుష్ప్రభావాలకు సూచిక కూడా వాస్తు శాస్త్రం చెబుతోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి