Shukra Gochar 2022 Effect: ఆస్ట్రాలజీ ప్రకారం, శుక్రుడి రాశి మార్పు ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న శుక్రుడు..ఆగస్టు 31న సింహరాశిలోకి (Venus Transit in leo 2022) ప్రవేశించనున్నాడు. సింహరాశిలో శుక్రుడి సంచారం కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉండనుంది. శుక్ర గ్రహం..ఆకర్షణ, ఐశ్వర్యం, అదృష్టం, సంపద, ప్రేమ, శృంగారానికి కారకుడు. శుక్ర సంచార సమయంలో ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
ఈ రాశులవారు బీ అలర్ట్..
వృషభం (Taurus): వృషభ రాశికి అధిపతి శుక్ర గ్రహం. కాబట్టి ఈ రాశివారి జీవితంలో కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఖర్చు దుబారా చేస్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మిధునరాశి (Gemini): శుక్ర సంచారం మిథునరాశి వారి కష్టాలను పెంచుతుంది. ఈ రాశులవారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీకు ఇతరుల మద్దతు లభించదు. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు రాశి (Sagittarius): శుక్రుడు రాశి మార్పు వల్ల ఈ రాశి వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఈ సమయంలో మాటలను అదుపులో ఉంచుకోండి. పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే దానిని వెంటనే విరమించుకోండి.
మకరరాశి (Capricorn): మకర రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. శుక్రుని సంచారం వైవాహిక జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది, దీని కారణంగా భార్యాభర్తల మధ్య ఏదో ఒక విషయంలో వివాదాలు రావచ్చు. దీంతోపాటు మీరు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
Also Read: Planet Transits 2022: సెప్టెంబరులో 3 గ్రహాల రాశి మార్పు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook