Vijayadashami 2024 Facts: భారత సాంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండగల్లో దసరా ఒకటి. నవరాత్రుల్లో భాగంగా భారతీయులు ఈ పండగను జరుపుకుంటారు. మంచిపై చెడు గెలిచినందుకుగాను ప్రతి సంవత్సరం నవరాత్రుల్లోని చివరి రోజున ఈ పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం దసరా పండగ అక్టోబర్ 12వ తేదీన వచ్చింది. పండగ రోజు అత్యంత శక్తివంతమైన కొన్ని యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. అలాగే ఈ పండగ రోజున ప్రతి ఒక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. అంతేకాకుండా మహిళలంతా ప్రత్యేకమైన వ్రతాలతో ఉపవాసాలు పాటిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున చాలామంది చేయకూడని పనులు చేస్తారు. ఇలా చేయడం వల్ల కొందరికి దసరా తర్వాత అనేక దుష్ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. అయితే దసరా పండగ రోజున చేయకూడదని పనులంటే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
దసరా పండుగ రోజున చేయకూడని పనులు:
మాంసాహారం తినడం:
చాలామంది దసరా పండగ రోజున మాంసాహారం తింటూ ఉంటారు. పురాణాల ప్రకారం ఈ పండగ రోజున మాంసాహారం తినడం వల్ల భవిష్యత్తులో అనేక దుష్ప్రభావాలు కలుగుతాయట. అంతేకాకుండా ఈ పండగ రోజున మాంసంతో పాటు వెల్లుల్లి వంటి కొన్ని కూరగాయలను కూడా తినకూడదట.
నిమ్మకాయ కోయడం:
శాస్త్రం ప్రకారం నిమ్మకాయను శుభప్రదంగా భావిస్తారు. కానీ దసరా పండగ రోజున నిమ్మకాయనుకోవడం అశుభమని పురాణాల్లో పేర్కొన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయదశమి పండగ రోజున నిమ్మకాయను కోయరాదని పూర్వీకులు చెబుతారు.
దీపాలను ఆర్పడం:
పురాణాల ప్రకారం దసరా పండగ రోజున దీపాలను ఆర్పకూడదు. ఈరోజు దీపాలను ఆర్పడం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని పురాణాల్లో తెలిపారు. దసరా పండగ రోజు ఎంత ఎక్కువగా వెలుతురు ఉంటే అంత మంచిదట
ఇంటికి తాళం వేయడం:
దసరా పండగ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తాళం వేయకూడదు. ఇలా వెయ్యడాన్ని అరిష్టంగా భావిస్తారు. అంతేకాకుండా కీడుకు సూచిక కూడా పరిగణిస్తారని పురాణాల్లో తెలిపారు. కాబట్టి దసరా పండగ రోజున ఇంట్లో ఒక్కరైనా ఉండడం చాలా మంచిది.
గొడవ పడడం:
ఎలాంటి పరిస్థితుల్లోనైనా దసరా పండగ రోజున వాదనలకు దిగకూడదని పెద్దలు చెబుతున్నారు. ఈరోజు గొడవ పడడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుందని ఒక నమ్మకం. అలాగే ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
కొత్త దుస్తులు కొనడం:
పూర్వికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయదశమి పండుగ రోజున కొత్త దుస్తులను కొనకూడద. అయితే ఈరోజు కొత్త దుస్తులను ధరించడం చాలా మంచిదని పురాణాల్లో తెలిపారు. కాబట్టి విజయదశమి పండుగ రోజున కొత్త దుస్తులు ధరించాలనుకునేవారు తప్పకుండా ఒకరోజు ముందే కొనుగోలు చేయడం ఎంతో మంచిది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.