Asia Cup 2020: ఢిల్లీ: ఆసియాకప్-2020 రద్దైనట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ప్రకటించారు. కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి వల్ల ఇప్పటికే పలు టోర్నమెంట్లు వాయిదా పడ్డాయని, మరికొన్ని రద్దు కూడా అయ్యాయని ఆయన గుర్తుచేశారు. ఇండియా టుడే విక్రాంత్ గుప్తాతో జరిగిన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో గంగూలీ ఆసియా కప్ 2020 (Asia Cup 2020) రద్దైనట్లు పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల మధ్య విరాట్ కోహ్లి నేతృత్వంలోని జట్టు మైదానంలోకి ఎప్పుడు అడుగుపెడుతుందో స్పష్టంగా చెప్పలేమని గంగూలీ పేర్కొన్నారు. ఈ మేరకు బీసీసీఐ అన్ని సన్నాహాలు చేసిందని, ప్రభుత్వ నిబంధనలకు అణుగుణంగా ముందుకు వెళతామని పేర్కొన్నారు. ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యమని, పరిస్థితులన్నింటిని పర్యవేక్షిస్తున్నామని గంగూలీ తెలిపారు. Also read: Bio-bubble: బయోబబుల్ అంటే ఏంటి? ఆటగాళ్లు పూర్తిగా సురక్షితమా ?
షెడ్యూల్ ప్రకారం ఆసియాకప్‌ను పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉంది. కానీ బీసీసీఐ (BCCI) అభ్యంతరం తెలపడంతో వేదిక దుబాయ్‌కి మారింది. సెప్టెంబరులో ఈ టోర్ని జరగాల్సిఉంది. అయితే రేపు (జూలై 9న) జరిగే ఆసియా క్రికెట్ మండలి సమావేశానికి ముందే ఈ టోర్నీ రద్దైనట్లు గంగూలీ పేర్కొనడం గమనార్హం. Also read: England Vs West Indies: ప్రేక్షకులు లేని టెస్టు మ్యాచు గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
లాక్‌డౌన్‌కి ముందు చివరిసారిగా భారత్ న్యూజిలాండ్‌తో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడింది. ఇదిలాఉంటే కరోనా కారణంగా ఏప్రిల్‌లో జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడింది. ఆసియా కప్ రద్దుతో ఐపీఎల్-2020 నిర్వహణకు మార్గం సులువు కానుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. Also read: టీమిండియాకు దూకుడు నేర్పిన ‘దాదా’ సౌరవ్ గంగూలీ
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..