Asia Cup 2022: ఆసియా కప్ సూపర్-4లో భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఖంగుతింది. చివరి ఓవర్లలో పట్టువదలడంతో మ్యాచ్ చేజారింది. కీలక సమయంలో క్యాచ్‌లు వదలడంతోపాటు దారుణంగా పరుగులు ఇవ్వడం దెబ్బతిసింది. 18వ ఓవర్‌లో రవి బిష్ణోయ్ వేసిన బంతిని పాక్ బ్యాటర్ అసిఫ్ అలీ గాలిలోకి ఆడాడు.
అక్కడే ఉన్న అర్ష్ దీప్ సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. చేతిలోకి వచ్చిన బంతిని వదిలేశాడు. దీంతో మ్యాచ్ టర్న్ అయ్యింది. పాకిస్థాన్ లక్ష్యాన్ని చేధించింది. భారత్ ఓటమికి అర్ష్‌దీప్ కారణమయ్యాడని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. కొందరైతే అర్ష్ దీప్ వికిపిడియాకు హ్యాక్ చేసి తప్పుడు ప్రచారం పోస్ట్ చేశారు.
దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సంబంధిత వికిపిడియాకు నోటీసులు జారీ చేసింది. ఐతే యువ ఆటగాడు అర్ష్‌దీప్‌కు సీనియర్లు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, హర్బజన్ సింగ్, సెహ్వాగ్ మద్దతు పలికారు. తాజాగా భారత పేసర్ మహమ్మద్ షమీ స్పందించాడు. ఈమేరకు ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. జరగబోయే మ్యాచ్‌లపై దృష్టి పెట్టు..దేశం గర్వించేలా ఆడు అని తెలిపాడు.
మరోవైపు సూపర్-4లో టీమిండియా రెండుమ్యాచ్‌లను ఆడనుంది. వీటిలో తప్పక గెలిస్తేనే ఫైనల్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఒక మ్యాచ్‌లో ఓడినా ఇంటికి వెళ్లక తప్పదు. ఇవాళ దుబాయ్ వేదికగా శ్రీలంకతో భారత్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా ఢీకొట్టనుంది. ఈరెండు మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తే నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఫైనల్‌లో మరోమారు పాక్, ఇండియానే తలపడతాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Also read:Etela Rajender: అసెంబ్లీలో టీఆర్ఎస్ తప్పించుకున్నా.. ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదన్న ఈటల..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి