Kohli vs Brett Lee: టీమ్ ఇండియా ఆటగాడు, మాజీ సారధి విరాట్ కోహ్లి క్రేజ్ మామూలుగా లేదు. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు..కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తేశాడు.
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని మించినోడు ఈ భూ ప్రపంచంలోనే లేడా..తరానికొకడే అలాంటోడు పుడతాడా..ఈ వ్యాఖ్యలు అతిశయోక్తిగా ఉన్నాయి కదూ..కానీ నిజమే. ఇవేమీ ఊరికే రాసినవి కావు. ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం బ్రెట్ లీ స్వయంగా విరాట్ కోహ్లి గురించి చేసిన వ్యాఖ్యలు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడేందుకు ఇండియాకు వచ్చిన బ్రెట్ లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
అదే సమయంలో విరాట్ కోహ్లి ఫామ్‌పై కూడా మాట్లాడాడు. కోహ్లీని ఎంత రన్ మెషీన్ అని పిలిచినా..ప్రతిసారీ సెంచరీ ఆశించడం అత్యాశేనని కోహ్లీని సమర్ధించుకొచ్చాడు. ఇలా చేయడం వల్ల కోహ్లీపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందన్నాడు. దాదాపు మూడేళ్లుగా సెంచరీ చేయకపోవడానికి కారణం ఇదేనన్నాడు. 130 కోట్ల భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్..కోహ్లి నుంచి ప్రతి మ్యాచ్‌లో సెంచరీ ఆశించకూడదన్నాడు.
క్రికెట్‌కు కోహ్లీ కోహినూర్ అని..ఆల్ టైమ్ గ్రేట్ అని కీర్తించాడు. కోహ్లిపై ఒత్తిడి పెంచకపోతే అద్భుతాలు సాధిస్తాడన్నాడు. మరోవైపు సచిన్ టెండూల్కర్‌తో ఉన్న అనుబంధాన్ని కూడా బ్రెట్ లీ గుర్తు చేసుకున్నాడు. సచిన్ ఓ సౌమ్యుడైన క్రికెటర్ అని చెప్పాడు. సచిన్‌తో పాటు బ్రియన్ లారా, జాక్ కలిస్‌లను కూడా పొగడ్తలతో ముంచెత్తాడు బ్రెట్ లీ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook