IPL 2022: మరికొన్ని నెలల్లో 15వ సీజన్ ఐపీల్ ప్రారంభం కానుంది. కొవిడ్ థార్డ్ వేవ్ భయాల (Corona Third wave) నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లన్నీ ఒకే నగరంలో జరిగే అవకాశాలున్నాయని (IPL 2022 in Mumbai only) ఓ నివేదిక వెల్లడించింది.
ఆ నివేదికలో ఇంకా ఏముందంటే..
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐపీఎస్ ప్రారంభమయ్యే అవకాశముంది. అయితే ప్రస్తుతం కొవిడ్ కేసులు, ఒమిక్రాన్ వేరియంట్ భయాలు వెంటాడుతున్న నేపథ్యంలో ముంబయిలోనే ఐపీఎల్ 2022 మొత్తం మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు (BCCI plan for IPL 2022) పేర్కొంది నివేదిక.
2021లో ఐపీఎల్ ఇలా..
ఐపీఎల్ 2021లోనూ దేశంలో కొవిడ్ భయాల కారణంగా ఏపీఎల్ మ్యాచ్‌లను కఠిన బయో బబుల్ రూల్స్‌తో ఆరు నగరాల్లో నిర్వహించాలని భావించింది (IPL 2021 details) బీసీసీఐ.
లీగ్ దశలో పలు మ్యాచ్‌లు అనుకున్నట్లుగానే జరిగాయి. అయితే బయో బబుల్‌లో ఉన్నప్పటికీ.. కొంతమంది ప్లేయర్స్, స్టాఫ్ కరోనా బారిన పడటంతో.. తదుపరి మ్యాచ్‌లను వాయిదా వేసింది బీసీసీఐ. అన్ని సర్దుకున్న తర్వాత సెప్టెంబర్-అక్టోబర్ మధ్య తిరిగి యూఏఈలో మిగతా మ్యాచ్‌లను (Corona in IPL) నిర్వహించింది బీసీసీఐ.
అందుకే ఒకే నగరం..
అయితే ఈ సారి దేశీయంగానే.. అది కూడా ఆటగాళ్లు ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ముంబయలోనే అన్ని మ్యాచ్‌లు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. అలా అయితే కొవిడ్ సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని బీసీసీఐ యోచిస్తున్నట్లు (BCCI on IPL 2022) నివేదికలో తేలింది.
అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందనేది.. బీసీసీఐ అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.
ఐపీఎల్ మ్యాచ్‌ల కన్నా ముందు ఫిబ్రవరిలో మెగా వేలం జరగాల్సి ఉంది. ఆ సమయానికి దేశంలో కొవిడ్ థార్డ్ వేవ్ వస్తే.. వేలం ప్రక్రియ ఎలా నిర్వహించనున్నారు (IPL Mega Auction) అనే విషయం కూడా ఇప్పుడు చర్చ సాగుతోంది.
Also read: Warner - Kohli: వైఫల్యాలు సహజమే.. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ విఫలమైనా ఫర్వాలేదు: వార్నర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook