ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో మరో పెద్ద చేప పేరు బయటికి వచ్చింది. బాలీవుడ్ ప్రముఖుడు సాజిద్ ఖాన్ బెట్టింగ్ కు పాల్పడినట్లు తెలిసింది. పోలీసు విచారణలో కస్టడీలో సోనూ జలన్ ఈ విషయాన్ని బటపెట్టాడు. సోనూ జలన్ ఇచ్చిన సమాచారం ప్రకారం దర్శకుడు సాజిద్ గత ఏడేళ్లుగా బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. కాగా పోలీసులు ఇప్పటి వరకు ఆయనకు సమన్లు జారీ చేయలేదు.. ప్రాధామిక నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఆ పనిచేయాలని పోలీసులు భావిస్తున్నారు.
ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో సల్మాన్ ఖాన్ సోదరుడు ఇరుకున్న విషయం తెలిసిందే. బెట్టింగ్ లో తాను రూ.2 కోట్ల మేర నష్టపోయానని పోలీసుల ఎదుట వెల్లడించాడు. కాగాఈ బెట్టింగ్ వ్యవహారాన్ని నడిపింది సోనూ జలన్ అని తేలింది. దీంతో ఆయన్ను ప్రధాన నిందితుడిగా చేర్చి పోలీసులు తమ కట్టడీలోకి తీసుకొన్నారు. పోలీసు విచారిస్తుండగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ పేరు బయట పెట్టి సోనూ జలన్ మరో బాంబు పేల్చాడు.
కాగా సోనూను అరెస్ట్ చేసిన తర్వాత అతని వద్ద నుంచి పోలీసులు ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలో వందకు పైగా బుకీల పేర్లు ఉన్నాయి. అర్భాజ్ తో పాటు ఎంతో మంది బిల్డర్లు, కాంట్రాక్టర్ల వివరాలు ఉన్నాయి. పోలీసుల విచారణలో పలువురు పెద్ద మనుషుల పేర్లను సోనూ బయటపెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. దీంతో విచారణ పూర్తయ్యేలోపు మరెంతమంది బాలీవుడ్ ప్రముఖలు పేర్లు బయటికి వస్తాయో మరి..