ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కగిసో రబాడ (Kagiso Rabada) అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. దిగ్గజ బౌలర్లను సైతం వెనక్కి నెడుతూ.. ఐపీఎల్ (IPL) చరిత్రలో అతి తక్కువ మ్యాచ్‌లలో 50 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సఫారీ పేసర్ రబాడ (Kagiso Rabada becomes fastest bowler to 50 IPL wickets) నిలిచాడు. షార్జా ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) బౌలర్ రబాడ ఈ ఘనత సాధించాడు.
ఐపీఎల్‌లో 27వ మ్యాచ్‌లోనే 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ రికార్డును రబాడ అధిగమించాడు. నరైన్ 32వ ఐపీఎల్ మ్యాచ్‌లో ఈ ఘనత అందుకోగా, రబాడ మరో 5 తక్కువ మ్యాచ్‌లకే హాఫ్ సెంచరీ వికెట్లు తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ సైతం కగిసో రబాడ వద్దే ఉండటం గమనార్హం. ఐపీఎల్ 2020లో 9 మ్యాచ్‌లాడిన రబాడ 19 వికెట్లు తన ఖాతాలో వేసుకుని పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో 3 మ్యాచ్‌లలో 3 లేక అంతకన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టడం గమనార్హం.
కాగా, నిన్న (అక్టోబర్ 17న) రాత్రి జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై ఢిల్లీ క్యాపిటల్స్ (DC) విజయం సాధించింది. ఐపీఎల్‌లో శిఖర్ ధావన్ (101 నాటౌట్: 58 బంతుల్లో 14ఫోర్లు, సిక్స్) తొలి శతకం సాధించాడు. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ క్లాస్ ఇన్నింగ్స్‌కు తోడు చివర్లో అక్షర్ పటేల్ (21 నాటౌట్; 5 బంతుల్లో 3 సిక్సర్లు) వీర విహారం చేయడంతో మరో బంతి మిగిలుండానే సీఎస్కే విసిరిన లక్ష్యాన్ని డీసీ ఛేదించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe