Delhi Capitals Vs Lucknow Super Giants Indians Playing XI Dream11 Team Tips: IPL 2024లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్ల కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 12 పాయింట్లతో ఆరోస్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. లక్నోను భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది. ఇక లక్నో ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 12 పాయింట్లతో ఏడోస్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ చేతిలో భారీ తేడాతో ఓటమిపాలవ్వడం ఆ జట్టును దెబ్బతీసింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లను తప్పకుండా నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా.. టాప్-4 నిలవడం కష్టమే. మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మ్యాచ్ ప్రారంభంకానుంది.
హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. ఢిల్లీ, లక్నో జట్లు ఐపీఎల్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో లక్నో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఢిల్లీ ఒక మ్యాచ్‌లో గెలుపొందింది. పిచ్ విషయానికి వస్తే.. అరుణ్ జైట్లీ స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్ స్వర్గధామం. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌కు ఎక్కువగా అనుకూలించింది. బ్యాటర్లు దూకుడుతో బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. మరోసారి హైస్కోరింగ్ మ్యాచ్ సాగే అవకాశం ఉంది. పిచ్ పరిస్థితుల దృష్ట్యా.. 220 స్కోరు చేసినా ఛేజింగ్ చేయడం పెద్ద కష్టం కాదు. గత మ్యాచ్‌లో నిషేధం కారణంగా దూరమైన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్.. తిరిగి ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు. గూగుల్ విన్ ప్రాబబిలిటీ ప్రకారం.. ఢిల్లీ ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశం 53 శాతం ఉంది. లక్నోకు గెలుపు అవకాశాలు 47 శాతం ఉన్నాయి. సొంతగడ్డపై ఢిల్లీ పైచేయి సాధించే అవకాశం ఉంది.
తుది జట్లు ఇలా.. (అంచనా)
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా , జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, షైయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అన్రిచ్ నోకియా, ఖలీల్ అహ్మద్.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), అర్షిన్ కులకర్ణి, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, అష్టన్ టర్నర్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్.
DC Vs LSG Dream11 Prediction:
==> వికెట్ కీపర్లు: రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), నికోలస్ పూరన్
==> బ్యాటర్లు: జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, ఆయుష్ బదోని
==> ఆల్ రౌండర్లు: మార్కస్ స్టోయినిస్
==> బౌలర్లు: కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter