GT Vs PBKS Playing 11 and Toss Updates: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో గుజరాత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించి.. ఒక మ్యాచ్‌లో ఓటమి పాలైంది. అటు పంజాబ్ తొలి మ్యాచ్‌లో గెలిచి.. వరుసగా రెండింటిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మళ్లీ గెలుపు బాట పట్టాలని చూస్తోంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్‌కు పంజాబ్ బ్యాటింగ్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. లివింగ్‌స్టోన్ స్థానంలో సికిందర్ రజాను పంజాబ్ తుది జట్టులోకి తీసుకుంది. డేవిడ్ మిల్లర్ ప్లేస్‌లో కేన్ విలియమ్సన్ గుజరాత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.
"మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. ఇది మంచి వికెట్‌లాగా కనిపిస్తోంది. అది అలాగే ఉంటుంది. మేము ఛేజింగ్‌ను ఇష్టపడతాం. కొన్ని మ్యాచ్‌లలో స్కోరు చాలా ఎక్కువగా ఉంది. కానీ ప్రతి గేమ్‌లో అలా ఉండదు. మేము మంచి క్రికెట్ ఆట తీరు కనబరుస్తున్నామని నేను భావిస్తున్నాను. టోర్నీ ఇంకా ఆరంభంలో ఉంది. మేము మరింత మెరుగ్గా ఆడబోతున్నాము. లివింగ్‌స్టోన్ స్థానంలో సికందర్ రజా జట్టులోకి వచ్చాడు.." అని పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ తెలిపాడు.
"టాస్ గెలిచి ఉంటే మేము బౌలింగ్ చేసే వాళ్లం. ప్రస్తుతం కొంచెం మబ్బుగా ఉంది. కాబట్టి మంచు ఉండదని భావిస్తున్నాం. ఈ టోర్నీని మేము చాలా బాగా ప్రారంభించాం. గతేడాది హోమ్ గ్రౌండ్‌కు దూరంగా చాలా బాగా ఆడాము. మిల్లర్ స్థానంలో కేన్ విలిమ్సన్ జట్టులోకి వచ్చాడు.." అని గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు.
తుది జట్లు ఇలా..:
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన), జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (వికెట్ కీపర్), ప్రభు సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే.