ICC World Cup 2023, IND vs AFG Live Score: టీమిండియా తన రెండో మ్యాచ్ లో దూకుడు ప్రదర్శిస్తోంది. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న పోరులో రికార్డుల మోత మోగిస్తున్నారు భారత బ్యాటర్లు. ముఖ్యంగా రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. అంతకముందు ఆ రికార్డు వెస్టిండీస్ వీరుడు క్రిస్ గేల్ (553) పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును రోహిత్ బద్దలుకొట్టాడు.
అంతేకాకుండా రోహిత్ శర్మ ప్రపంచకప్‌లలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేశాడు హిట్ మ్యాన్. చెన్నైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు ముందు భారత కెప్టెన్ 17 ఇన్నింగ్స్‌లలో 978 పరుగులతో ఉన్నాడు. ఆసీస్ జరిగిన మ్యాచ్ లో రోహిత్ డకౌట్ అయ్యాడు. తాజాగా అప్ఘాన్ తో జరిగిన మ్యాచ్ లో వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లి తర్వాత 1000 పరుగుల మార్కును సాధించిన నాలుగో ఇండియన్ బ్యాటర్ రోహిత్. 2015లో 330 పరుగులు, 2019 వరల్డ్ కప్ ఎడిషన్‌లో 648 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్‌తో సమానంగా ఆరు సెంచరీలతో రోహిత్ ఉన్నాడు.
మరోవైపు తాజాగా జరుగుతున్న మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ముఖ్యంగా రోహిత్ సిక్సర్లు, ఫోర్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నాడు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. కేవలం 63 బంతుల్లోనే టీమిండియా కెప్టెన్ సెంచరీ సాధించాడు. దీంతో వరల్డ్ కప్ లో అత్యధిక సెంచరీల సాధించిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఇషన్ కిషాన్ 47 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో టీమిండియా 18.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 156 పరుగులు చేసింది. అంతేకాకుండా ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు రోహిత్. ఇతడు కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు.
Also Read: Shubman Gill Health Update: శుభమన్ గిల్ త్వరగా కోలుకుంటున్నాడు.. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి