Ind vs Afg 3rd T20: మొహాలీ, ఇండోర్ టీ20ల్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా ఇప్పుడు చివరి టీ20 బెంగళూరు వేదికగా ఆడేందుకు సిద్ధమౌతోంది. క్లీన్‌స్వీప్ కోసం ఇండియా, పరువు నిలబెట్టుకునేందుకు ఆఫ్ఘనిస్తాన్ జట్లు ప్రయత్నించనున్నాయి. చివరి మ్యాచ్ పిచ్ ఎలా ఉంటుంది, జట్టులో ఏయే మార్పులుంటాయనేది పరిశీలిద్దాం..
టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇండియాకు ఇది ఆఖరి టీ20. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో మూడు టీ20లో సిరీస్‌ను ఇప్పటికే ఇండియా 2-0తో చేజిక్కించుకుంది. మూడవ టీ20 ఇవాళ బెంగళూరు వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయంతో క్లీన్‌స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. అటు ఆఫ్ఘనిస్తాన్ అయితే కనీసం మూడో మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.
పిచ్ స్వభావం ఎలా ఉందంటే
ఇవాళ మ్యాచ్ జరుగుతున్న బెంగళూరు చిన్నస్వామి స్డేడియంలో ఇప్పటి వరకూ 17 మ్యాచ్‌లు జరగగా తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 7 గెలవగా బౌలింగ్ చేసిన జట్లు 9 మ్యాచ్‌లు గెలిచాయి. ఈ పిచ్‌పై అత్యధిక స్కోరు 202 పరుగులు కాగా, అత్యల్పంగా 99 పరుగులు నమోదయ్యాయి. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలున్నాయి. బౌండరీ లైన్ చిన్నది కావడంతో భారీ స్కోర్లకు అవకాశముంది. ఉష్ణోగ్రత 28 డిగ్రీలుండవచ్చు. వర్షం పడే సూచనలు లేవు.
ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ సంజూ శామ్సన్‌కు అవకాశం దక్కవచ్చు. ఎందుకంటే మరో వికెట్ కీపర్ జితేష్ శర్మకు తొలి రెండు టీ20ల్లో అవకాశమిచ్చారు. ఈసారి సంజూ శామ్సన్‌కు అవకాశం లభించవచ్చు. తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న కుల్దీప్ యాదవ్‌ను ఈసారి రవి బిష్షోయ్ స్థానంలో ఎంచుకోవచ్చు. ముకేశ్ కుమార్ స్థానంలో అవేశ్ ఖాన్‌కు అవకాశం లభించవచ్చు. ఇక బ్యాటింగ్ పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. శివమ్ దూబే, యశస్వి జైశ్వాల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ రాణించాల్సి ఉంటుంది. విరాట్ కోహ్లీ బిందాస్‌గా ఆడుతున్నాడు.
టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 అంచనా
రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, సంజూ శామ్సన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్
Also read: Ayodhya Route: అయోధ్యకు ఏయే మార్గాల ద్వారా ఎలా చేరుకోవచ్చు, పూర్తి వివరాలు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook