India vs Australia 3rd Test Day 1 Highlights: భారత్‌తో ప్రారంభమైన మూడో టెస్టులో తొలిరోజు ఆతిథ్య ఆస్ట్రేలియా మెరుగైనస్థితిలో నిలిచింది. సిడ్నీ టెస్టు తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టపోయి 166 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ విఫలమైనా, అరంగేట్ర ఆటగాడు యువ ఓపెనర్ విల్ పుకోస్కీ రాణించాడు.
డేవిడ్ వార్నర్(David Warner)తో పాటు ఓపెనింగ్‌కు దిగిన అరంగేట్ర ఆటగాడు విల్ పుకోస్కీ(62: 110 బంతుల్లో 4ఫోర్లు), మార్నస్ లబుషేన్(67 నాటౌట్: 149 బంతుల్లో 8ఫోర్లు) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. పుకోస్కీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్(31 బ్యాటింగ్: 64 బంతుల్లో 5ఫోర్లు) మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నాడు. దాంతో తొలి రోజు ఆతిథ్య జట్టు కేవలం 2 వికెట్లు నష్టపోయి 166 పరుగులు చేసింది.
Also Read: David Warner: వికెట్ తీసిన ఆనందంలో మహ్మద్ సిరాజ్.. వీడియో
తొలుత టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే టీమిండియా(Team India) బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆదిలోనే కంగారూలను దెబ్బతీశాడు. డేవిడ్ వార్నర్(5)ను జట్టు స్కోరు 6 పరుగుల వద్ద ఔట్ చేశాడు. చటేశ్వర్ పుజారా ఫస్ట్ స్లిప్‌లో క్యాచ్ అందుకోవడంతో నిరాశగా వార్నర్ పెవిలియన్‌కు చేరాడు.
Also Read: 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్.. ఆసక్తికర విషయాలు
✔️ Will Pucovski fifty
✔️ Marnus Labuschagne fifty
✔️ Just two wickets lostAustralia looked 💪 on the first day in Sydney.#AUSvIND SCORECARD ▶️ https://t.co/Zuk24dsH1t pic.twitter.com/AFNlAnWGSo
— ICC (@ICC) January 7, 2021
ఆ తర్వాత లబుషేన్, విల్ పుకోస్కీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే ఆరంగేట్ర మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన పుకోస్కీని టీమిండియా అరంగేట్ర బౌలర్ నవదీప్ సైనీ ఔట్ చేశాడు. పుకోస్కీ(62) ఔటయ్యాక.. మరో వికెట్ పడకుండా స్టీవ్ స్మిత్, లబుషేన్ వికెట్లకు గొడకడుతున్నారు. ఈ క్రమంలో టాలెంటెడ్ ప్లేయర్ లబుషేన్ టెస్ట్ కెరీర్‌లో 9వ హాఫ్ సెంచరీ సాధించాడు. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడటంతో పూర్తి కోటా ఓవర్లు సాధ్యం కాలేదు.
Also Read: Sleeping At Afternoon: మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రించవచ్చా.. ఈ లాభాలు తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook