IND vs AUS: టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ మంచి టచ్‌లో ఉన్నాడు. ఆసియా కప్ నుంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లోనూ జోరు కొనసాగించారు. ఈనేపథ్యంలో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన మూడో టీ20లో విరాట్ కోహ్లీ రఫ్ఫాడించాడు.
48 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. కీలక ఇన్నింగ్స్ ద్వారా జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో టీమిండియా వాల్, ప్రస్తుత టీమ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డును చెరిపివేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 34 వేల 357 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ప్లేయర్‌గా సచిన్ ఉన్నాడు. ఆ తర్వాత రెండో ప్లేస్‌కి టీమిండియా మాజీ సారధి కోహ్లీ చేరాడు. ఇటు ద్రవిడ్ తన కెరీర్‌లో 24 వేల 64 పరుగులు చేశాడు.
నిన్నటి ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ 24 వేల 78 పరుగులు సాధించాడు. ఈనేపథ్యంలో ద్రవిడ్ రికార్డును బద్ధలు కొట్టాడు. భారత తరపున అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాళ్లల్లో సచిన్, కోహ్లీ, ద్రవిడ్, గంగూలీ, ఎంఎస్ ధోనీ టాప్-5లో ఉన్నారు. ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో అఫ్ఘనిస్థాన్‌పై కోహ్లీ తొలి సెంచరీని నమోదు చేశాడు. మొత్తంగా సచిన్ టెండుల్కర్ 664 మ్యాచ్‌ల్లో 34 వేల 357 పరుగులు చేశాడు. 471 మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ 24 వేల 078 పరుగులు..404 మ్యాచ్‌ల్లో రాహుల్ ద్రవిడ్ 24 వేల 064 పరుగులు సాధించారు.
భారత మాజీ సారధి సౌరవ్ గంగూలీ..421 మ్యాచ్‌ల్లో 18 వేల 433 పరుగులు చేయగా..మహేంద్ర సింగ్ ధోనీ..538 మ్యాచ్‌ల్లో 17 వేల 092 పరుగులు చేశారు.
Scorecard ▶️ https://t.co/xVrzo737YV #TeamIndia | #INDvAUS pic.twitter.com/FLvsIGc9sg
— BCCI (@BCCI) September 25, 2022
🗨️🗨️ I am enjoying my process at the moment: @imVkohli
Scorecard ▶️ https://t.co/xVrzo737YV #TeamIndia | #INDvAUS pic.twitter.com/7JlLTyDj6y
— BCCI (@BCCI) September 25, 2022
Also read:హైదరాబాద్ ఎంతో ప్రత్యేకం.. గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి: రోహిత్ శర్మ
Also read:SSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..ఎస్‌ఎస్‌సీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook