Ind Vs NZ: కివీస్‌తో రెండో టీ20.. ఎవరూ ఊహించని రెండు మార్పులు.. పృథ్వీ షా ఎంట్రీ కన్ఫార్మ్..!

India vs New Zealand 2nd T20 Playing 11: మొదటి టీ20 మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడిపోతే సిరీస్ కివీస్ సొంతం అవుతోంది. రెండో టీ20 మ్యాచ్‌కు భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. కూర్పు ఇలా ఉండే ఛాన్స్ ఉంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2023, 08:53 PM IST
Ind Vs NZ: కివీస్‌తో రెండో టీ20.. ఎవరూ ఊహించని రెండు మార్పులు.. పృథ్వీ షా ఎంట్రీ కన్ఫార్మ్..!

India vs New Zealand 2nd T20 Playing 11: తొలి టీ20 మ్యాచ్‌లో ఓడిన భారత్‌కు రెండో మ్యాచ్ చావోరేవోగా మారింది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడిపోతే టీ20 సిరీస్ న్యూజిలాండ్ వశం అవుతుంది. సొంతగడ్డపై సిరీస్‌ను కోల్పోతే టీమిండియాకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మొదటి మ్యాచ్‌లో టాప ఆర్డర్ విఫలమవ్వడం.. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ చివరి ఓవర్‌లో భారీగా పరుగులు ఇవ్వడం భారత్‌ను ముంచింది. దీంతో రెండో మ్యాచ్‌కు తుది జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం రాత్రి 7:00 గంటల నుంచి లక్నోలోని ఎకానా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రెండో టీ20 జరగనుంది.

ఈ మ్యాచ్‌కు ఓపెనింగ్ స్లాట్‌లో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. అద్భుత ఫామ్‌లో ఉన్న పృథ్వీ షాను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవాలని అన్ని వైపులా నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. వరుసగా విఫలమవుతున్న రాహుల్ త్రిపాఠి ప్లేస్‌లో షా తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే శుభ్‌మన్ గిల్‌కు తోడు పృథ్వీ షా ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ వన్‌డౌన్‌లో ఆడతాడు.  

స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ 4వ నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఆల్ రౌండర్ దీపక్ హుడా  ఆ తరువాతి స్థానాల్లో ఆడనున్నారు. గత మ్యాచ్‌లో కుదురుకున్నట్లే కనిపించిన పాండ్యా కీలక సమయంలో ఔట్ అవ్వడం దెబ్బ తీసింది. దీపక్ హుడా నిర్లక్ష్యం వికెట్ పారేసుకోవడంపై కూడా చర్చ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా హుడా విఫలమైతే ఇక బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. మరో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ దుమ్ములేపాడు. బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లు తీయడంతోపాటు.. బ్యాటింగ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సుందర్ మరోసారి కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది.  

బౌలింగ్‌ విభాగంలో కూడా మార్పులు చోటు చేసుకోనున్నాయి. ధారళంగా పరుగులు ఇస్తున్న అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో ముఖేష్‌ కుమార్‌కు అవకాశం ఇవ్వాలని మాజీలు సూచిస్తున్నారు. ముఖ్యంగా చివరి ఓవర్‌లో 27 పరుగులు సమర్పించుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నోబాల్స్ బలహీనత నుంచి కూడా ఇంకా పూర్తిగా బయటపడలేదు. దీంతో రెండో టీ20కి పక్కనపెట్టే ఛాన్స్ ఉంది. కుల్దీప్ యాదవ్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులో ఉండనున్నారు. 

టీమిండియా తుది జట్టు (అంచనా): పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.

Also Read: Minister Roja: లోకేష్‌ అడుగుపెడితే ప్రాణాలు గాల్లోకే.. తారకరత్న త్వరగా కోలుకోవాలి: మంత్రి రోజా  

Also Read: Go First: 55 మంది ప్రయాణికులను విడిచివెళ్లిన గోఫస్ట్‌పై భారీ జరిమానా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News