IPL 2022 GT vs LSG Toss, Gujarat Titans opt to bowl: ఐపీఎల్ 2022లో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో కొత్త జట్లు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో కెఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయిట్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. లక్నో ఇన్నింగ్స్‌ను కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ ఆరంభిస్తారు.
ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి గుజరాత్‌కు కెప్టెన్ పాండ్యాపైనే నిలిచింది. ఇంతకుముందు ఐపీఎల్‌లో అతడు కెప్టెన్సీ చేయకపోవడమే అందుకు కారణం. అలానే ఈ మ్యాచ్‌లో ఇద్దరు అన్నదమ్ములు పోటీపడడం చూడొచ్చు. హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా లక్నో జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ తరపున ఆడేవారు. కానీ ఈసారి వేర్వేరు జట్లలో ఆడుతున్నారు.
A look at the Playing XI for #GTvLSG
Live - https://t.co/u8Y0KpnOQi #GTvLSG #TATAIPL https://t.co/IwRUSZE08H pic.twitter.com/uZfpKEI8A8
— IndianPremierLeague (@IPL) March 28, 2022
తుది జట్లు:
గుజరాత్: శుభమన్ గిల్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ ఆరోన్, మహమ్మద్ షమీ.
లక్నో: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook