IPL 2022 Playoffs Rules: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ చివరి అంకానికి చేరింది. ఆదివారం (మే 22) లీగ్ దశలో చివరి మ్యాచ్ జరిగింది. నాలుగు జట్లు ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్‌కు చేరగా.. ఆరు టీమ్స్ ఇంటి బాట పట్టాయి. గుజరాత్ టైటాన్స్ టేబుల్ టాపర్‌గా నిలవగా.. రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లను చూసి ఎంజాయ్ చేద్దామనుకుంటున్న అభిమానులను ఓ బ్యాడ్ న్యూస్.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మంగళవారం (మే 24) రాత్రి 7:30కు జరిగే క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఇదే వేదికపై మే 25న ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ కొంటాయి. మే 27న
అహ్మదాబాద్‌లో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ జరుగుతుంది. ఇదే వేదికపై మే 29న ఫైనల్ జరుగుతుంది. అయితే ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు వణరుడి ముప్పు పొంచి ఉంది. వారం ప్రారంభంలో వర్షాలు కోల్‌కతా, అహ్మదాబాద్ నగరాల్లో కురుస్తాయని సమాచారం.
ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు వాన ముప్పు పొంచి ఉండడంతో.. ఒక వేళ మ్యాచ్‌లు జరగకపోతే విజేతను ఎలా నిర్ణయిస్తారో చూద్దాం. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉండదు. అప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓవర్లు కుదించి ఆడడం ఓ ఆప్షన్ అయితే.. 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడం ఇంకో ఆప్షన్. ఒకవేళ ఇది కూడా సాధ్యం కాకపోతే.. విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో.. లీగ్ దశలో అగ్రస్థానంలో ఉన్న జట్టు విజేతగా నిలుస్తుంది.
ఫైనల్ మ్యాచుకు మాత్రం రిజర్వ్ డే ఉంది. 29న జరిగే ఫైనల్‌కు అంతరాయం ఏర్పడితే.. మే 30వ తేదీన ఫైనల్ నిర్వహిస్తారు. మే 29న ఒకవేళ టాస్ పడ్డాక మ్యాచ్ మొదలు కాకుంటే.. రిజర్వ్ డే రోజు మళ్లీ ఫ్రెష్ టాస్ వేస్తారు. ఇక రిజర్వ్ డే కూడా ఆట సాధ్యం కాకపోతే (5 ఓవర్ల మ్యాచ్), కనీసం సూపర్ ఓవర్ కూడా జరగని పరిస్థితి ఉంటే.. ఫైనల్ వెళ్లిన జట్లలో ఏ టీమ్ అయితే లీగ్ స్టేజీలో మెరుగైన స్థానంలో ఉంటుందో ఆ జట్టు విజేతగా నిలుస్తుంది.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఫైనల్ రోజు, రిజర్వ్ ఫైన్ డే రోజు గానీ సూపర్ ఓవర్ జరగడానికి రాత్రి 1.20am వరకు అవకాశం ఉంటుంది. క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు సూపర్ ఓవర్ నిర్వహించడానికి రాత్రి 12.50am లోపు సమయం ఉంటుంది. ఇక మ్యాచ్ జరుగుతుండగా.. మధ్యలో వాన పడితే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడానికి DLS పద్ధతి ఉంటుందన్న విషయం తెలిసిందే.
Also Read: Aishwarya Rai Bachchan Cannes 2022: కేన్స్‌లో ఐశ్వర్య రాయ్ తళుకులు.. ప్రత్యేక ఆకర్షణగా ఆరాధ్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook