LSG vs RR: స్టోయినిస్ వృధా చేసిన ఆ మూడు బంతులే లక్నో కొంప ముంచాయి

LSG vs RR: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతంగా ప్రదర్శన ఇస్తోంది. ఉత్కంఠభరితంగా సాగిన లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 11, 2022, 07:50 AM IST
LSG vs RR: స్టోయినిస్ వృధా చేసిన ఆ మూడు బంతులే లక్నో కొంప ముంచాయి

LSG vs RR: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతంగా ప్రదర్శన ఇస్తోంది. ఉత్కంఠభరితంగా సాగిన లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్ సీజన్ 15 లో గత ఛాంపియన్లు చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్‌లు చతికిలపడ్డాయి. నాలుగేసి మ్యాచ్‌లు ఆడినా ఇంకా బోణీ చేయలేకపోయాయి. అటు రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ జట్లు టాప్ 4లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతంగా రాణిస్తూ..పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకూ రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్‌లు ఆడి మూడింట గెలిచి..6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. 

నిన్న జరిగిన ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్‌జి మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆ తరువాత 166 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి..162 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. డికాక్, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, స్టోయినిస్ తప్ప మరెవరూ రాణించలేదు. 

ఆ మూడు బంతులే కీలకం

స్టోయినిస్ విజృంభించి ఆడటంతో చివరి వరకూ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. అదే సమయంలో స్టోయినిస్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ జట్టు కొంప ముంచింది. ఎందుకంటే చివరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా..ఆవేశ్ ఖాన్ సింగిల్ తీసి స్టోయినిస్‌కు అవకాశమిచ్చాడు. ఎందుకంటే అప్పటివరకూ స్టోయినిస్ విజృంభించి ఆడాడు. ఇక ఐదు బంతుల్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా..అనసవరమైన భారీ షాట్లకు ప్రయత్నించి వరుసగా మూడుసార్లు విఫలమయ్యాడు. దాంతో 2 బంతుల్లో 14 పరుగులకు పరిస్థితి చేరింది. తరువాత ఓ బౌండరీ కొట్టడంతో ఒక బంతికి పది పరుగులు చేయాల్సిన పరిస్థితి. చివరి బంతికి తిరిగి సిక్సర్ కొట్టినా ప్రయోజన లేకపోయింది. స్టోయినిస్ వేస్ట్ చేసిన ఆ మూడు బంతులే కీలకంగా మారాయి. చివరి ఓవర్ బౌల్ చేసిన కుల్దీప్ సేన్ కూడా తెలివిగా బాల్ విసరగలిగాడు. స్టోయినిస్ బలహీనతను ఆసరగా చేసుకుని టెంప్ట్ అయ్యేలా చేశాడు. 

Also read: Delhi Capitals: ఐపీఎల్ 2022లో అరుదైన రికార్డు నెలకొల్పిన ఢిల్లీ క్యాపిటల్స్.. మొదటి జట్టుగా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News