SRH Playing 11 vs KKR: కోల్‌కతాతో సన్‌రైజర్స్ ఢీ.. వాషింగ్టన్ సుందర్ దూరం! ఇక తుది జట్టులో చోటు అతడికే..

IPL 2022, SRH Playing 11 vs KKR. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ వాషింగ్టన్ సుందర్ స్థానంలో జగదీష సుచిత్, అబ్దుల్ సమద్‌, శ్రేయస్ గోపాల్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2022, 04:20 PM IST
  • కోల్‌కతాతో సన్‌రైజర్స్ ఢీ
  • వాషింగ్టన్ సుందర్ దూరం
  • సన్‌రైజర్స్ తుది జట్టులో చోటు అతడికే
SRH Playing 11 vs KKR: కోల్‌కతాతో సన్‌రైజర్స్ ఢీ.. వాషింగ్టన్ సుందర్ దూరం! ఇక తుది జట్టులో చోటు అతడికే..

SRH Playing 11 vs KKR: Washington Sundar replaced by Jagdeesha Suchith or Abdul Samad: ఐపీఎల్ 2022లో భాగంగా ఈరోజు రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని బ్రాబౌర్న్ మైదానంలో రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా.. 7.30కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన చివరి మ్యాచులో ఓడిన కోల్‌కతా.. ఎఈరోజు గెలవాలని చూస్తోంది. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో మంచి విజయాలు అందుకున్న హైదరాబాద్‌.. హ్యాట్రిక్ గెలుపై కన్నేసింది. అయితే గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుకు దూరమవడం కాస్త కలవరపెట్టే అంశం. 

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ వాషింగ్టన్ సుందర్ 2-3 మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. దాంతో నేడు కోల్‌కతాతో జరిగే మ్యాచుకు అతడు దూరం అయ్యాడు. దాంతో జగదీష సుచిత్, అబ్దుల్ సమద్‌, శ్రేయస్ గోపాల్‌లు సుందర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే బ్యాటింగ్, బౌలింగ్ చేయగల సమద్, సుచిత్‌లలో ఒకరి అవకాశం దక్కనుంది. అబ్దుల్ సమద్ ఆరంభ మ్యాచ్‌ల్లో విఫలమవడంతో టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని పక్కన పెట్టింది. దాంతో సుచిత్‌కే తుది జట్టులో ఆడే ఆవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

ఓపెనర్లు అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ ఫామ్ అందుకున్నారు కాబట్టి ఓపెనింగ్ కాంబినేషన్‌ను మార్చే చాన్స్ లేదు. మూడో స్థానంలో రాహుల్ త్రిపాఠి బ్యాటింగ్‌కు రానున్నాడు. నాలుగో స్థానంలో హిట్టర్ నికోలస్ పూరన్ బ్యాటింగ్ చేయనుండగా.. ఐదో స్థానంలో ఐడెన్ మార్క్‌రమ్ ఆడనున్నాడు. ఈ ఇద్దరు మరోసారి చెలరేగాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. ఆరో స్థానంలో యువ ఆల్‌రౌండర్ శశాంక్ సింగ్ ఆడుతాడు. భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్‌లు పేస్ విభాగంలో ఆడనున్నారు. అయితే 
అంతగా ప్రభావం చూపని జాన్సెన్ స్థానంలో ఆస్ట్రేలియా పేస్ ఆల్‌రౌండర్ సీన్ అబాట్ వచ్చే అవకాశం ఉంది. 

తుది జట్టు అంచనా:
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్‌రమ్, జగదీష సుచిత్/అబ్దుల్ సమద్‌, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్/సీన్ అబాట్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్. 

Also Read: Joe Root Captaincy: కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన జో రూట్‌.. అసలు కారణం అదే!

Also Read: Vijay Shankar: ఆ విజయ్ శంకర్‌ ఎందుకురా బాబు.. క్రికెట్ ఆడకుండా నిషేధించండి! త్రీడీ ప్లేయర్ అంటే నవ్వొస్తుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News