Mumbai Indians: తట్టాబుట్టా సర్దేసిన ముంబై ఇండియన్స్.. పాండ్యా కెప్టెన్సీలో దేవుడికి ఇచ్చేశారు..!

Mumbai Indians Playoffs Chances: ఈ సీజన్‌లో హర్ధిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ అన్ని జట్ల కంటే ముందే తట్టాబుట్టా సర్దేసింది. ఆడిన 11 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 8 ఓటములతో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. చివరి మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా.. టాప్-4లో నిలవడం అసాధ్యం.   

Written by - Ashok Krindinti | Last Updated : May 4, 2024, 01:49 PM IST
Mumbai Indians: తట్టాబుట్టా సర్దేసిన ముంబై ఇండియన్స్.. పాండ్యా కెప్టెన్సీలో దేవుడికి ఇచ్చేశారు..!

Mumbai Indians Playoffs Chances: ఈ సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి తప్పించి.. హార్ధిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఐదుసార్లు ముంబైను ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ను చెప్పపెట్టకుండా కెప్టెన్సీను తొలగించడంతో ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్స్‌ను లక్షల్లో అన్‌ఫాలో చేశారు. ఈ సీజన్‌లో ముంబై దారుణంగా ఓడిపోవాలని కలలగన్నారు. రోహిత్ శర్మ బాగా ఆడాలని.. కానీ ముంబై ఓడిపోవాలని కోరుకున్నారు. చివరికి అదే జరిగింది. ఈ సీజన్‌లో ముంబై జట్టు పర్ఫామెన్స్ దారుణంగా ఉంది. ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడోస్థానంలో ఉంది. 

Also Read: Trisha Top Movies: త్రిష కెరీర్‌లో టాప్ చిత్రాలు ఇవే..

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఖాతాలో కేవలం 6 పాయింట్లే ఉన్నాయి. ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడింటిలో గెలిచినా.. ముంబై ఖాతాలో 12 పాయింట్లు ఉంటాయి. దీంతో ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఏమాత్రం లేవు. ముంబై ఆడిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ చేతిలో ఓటమిపాలై అందరీ కంటే ముందే టోర్నీ నుంచి తప్పుకుంది. చివరగా పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందిన ముంబై.. మళ్లీ గెలుపు రుచి చూడలేదు. 

ముంబై ఇండియన్స్ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. మూడుకు మూడు గెలిచినా 12 పాయింట్లతో చివరిస్థానం నుంచి గట్టేక్కుతుంది. ప్లే ఆఫ్స్‌కు చేరుతుందని మాత్రం గ్యారంటీ లేదు. ఆ జట్టు మూడు మ్యాచ్‌లు భారీ నెట్‌రన్‌ రేట్‌తో నెగ్గినా.. 0.0006 శాతం మాత్రమే ప్లే ఆఫ్ చేరేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్‌ను దేవుడికి ఇచ్చేసే ముంబై ఇండియన్స్.. ఈ సీజన్‌ మొత్తాన్ని కూడా ఇచ్చేసిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు రాణించినా.. బ్యాట్స్‌మెన్ చేతులేత్తేయడంతో ముంబైకు పరాభవం తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. 19.5 ఓవర్లల్లో 169 రన్స్‌కు ఆలౌట్ అయింది. అనంతరం ముంబై ఇండియన్స్ 18.5 ఓవర్లల్లో 145 పరుగులకు కుప్పకూలింది. దీంతో సొంతగడ్డపై 24 పరుగుల తేడాతో ఓటమిపాలై.. ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. 

Also Read: Hamida banu: భారత్ తొలి రెజ్లర్ .. గూగుల్ డూడుల్ హమీదా భాను గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News