Eoin Morgan Unsold in IPL Auction 2022: ఐపీఎల్ రెండో రోజు వేలంలో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. వేలంలో మోర్గాన్ కనీస ధర రూ.1.50 కోట్లు కాగా.. అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఫైనల్‌కి చేర్చడంలో కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించినప్పటికీ.. వ్యక్తిగతంగా అతని పెర్ఫామెన్స్ కోల్‌కతాను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో కోల్‌కతా మోర్గాన్‌ను వదులుకుంది.
ఐపీఎల్ 2020, 2021 సీజన్లలో మోర్గాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2020లో దినేశ్ కార్తీక్‌ను కెప్టెన్‌గా తప్పించడంతో ఆ బాధ్యతలు మోర్గాన్‌కి దక్కాయి. ఐపీఎల్లో కోల్‌కతా తరుపున మొత్తం 24 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన మోర్గాన్.. 47.91 శాతం విన్నింగ్‌ని నమోదు చేశాడు. ఫామ్‌లో ఉన్నరోజు తనదైన శైలిలో చెలరేగే మోర్గాన్.. గత సీజన్లో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.
గత సీజన్లో మోర్గాన్ కోల్‌కతా తరుపున 17 మ్యాచ్‌ల్లో కేవలం 133 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటివరకూ ఐపీఎల్లో మొత్తం 83 మ్యాచ్‌లు ఆడిన అతను 1405 పరుగులు చేశాడు. ఇందులో కేవలం ఐదు అర్ధ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. వయసు మీద పడుతుండటం కూడా మోర్గాన్ ఫామ్ లేమికి కారణమనే వాదన వినిపిస్తోంది.
రెండో రోజు ఐపీఎల్ వేలంలో ఇయాన్ మార్గాన్తో పాటు విదేశీ ఆటగాళ్లు అరోన్ ఫించ్, జేమ్స్ నీషమ్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ మిల్లర్, స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. భారత ఆటగాళ్లలో ఇషాంత్ శర్మ, సౌరబ్ తివారీ, ఛటేశ్వర్ పుజారా అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook