Umran Malik Unsold in IPL Mega Auction 2025: మొదటి రోజు టాప్ ప్లేయర్ల వేలంతో ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ మెగా వేలం.. రెండో రోజు కూడా జోరుగా సాగుతోంది. కొందరు ప్లేయర్లు ఊహించిన జాక్‌పాట్ కొడితే.. స్టార్ ప్లేయర్లు సైతం అన్‌సోల్డ్‌గా మిగిలిపోతున్నారు. అన్ని ఫ్రాంచైజీలు పర్స్ విషయంలో పక్కా ప్లాన్‌తో వేలంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. తొలి రోజు వేలంలో భారీగా ఖర్చు పెట్టడంతో రెండో రోజు ఉన్న అమౌంట్‌లోనే ఆచితూచి కొనుగోలు చేస్తున్నాయి. ఇక స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ ఈసారి వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. గత సీజన్ వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన ఉమ్రాన్ మాలిక్‌ను ఈసారి వేలంలో కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. గత సీజన్‌లో ఉమ్రాన్ మాలిక్ తేలిపోయాడు. దీంతో తుది జట్టులో చోటు కూడా దక్కలేదు. ఈసారి వేలానికి ముందు మాలిక్‌ను టీమ్ నుంచి ఎస్‌ఆర్‌హెచ్ రిలీజ్ చేసింది.
Also Read: Kavya Maran: ఆస్తిపాస్తుల్లో అంబానీలకు పోటీగా కావ్య మారన్.. ఆమె ఆస్తుల చిట్టా ఇదే!
జమ్మూ కాశ్మీక్‌కు చెందిన ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అరంగేట్రం చేశాడు. స్థిరంగా 150 kmph బౌలింగ్ చేయడం ఈ యంగ్ బౌలర్ సొంతం. 2022 మెగా వేలంలో 4 కోట్లకు రిటైన్ చేసుకుంది సన్‌రైజర్స్. ఆ సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు ఆడిన మాలిక్.. 29 వికెట్లు తీశాడు. ఇందులో 2022 సీజన్‌లోనే 22 వికెట్లు పడగొట్టాడు. గత రెండు సీజన్ల నుంచి పెద్దగా ఆకట్టులేకపోయాడు. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా.. చెత్త ప్రదర్శనతో స్థానం నిలుపుకోలేకపోయాడు.
వేలంలోకి ఉమ్రాన్ మాలిక్ రావడంతో ఏ టీమ్ అయినా కచ్చితంగా తీసుకుంటుందని అందరూ అనుకున్నారు. రూ.75 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి రాగా.. ఎవరూ కూడా మాలిక్ కోసం ప్రయత్నించలేదు. బేస్‌ప్రైస్‌కే లభించే అవకాశం ఉన్నా.. కావ్య మారన్ స్పందించలేదు. ఎంతో వేగంగా దూసుకువచ్చిన ఉమ్రాన్ మాలిక్.. ఫామ్ కోల్పోయి అంతే వేగంగా డౌన్‌ఫాల్ అయ్యాడు. మాలిక్‌తోపాటు మాయంక్ అగర్వాల్, పృథ్వి షా, ఉమేశ్ యాదవ్, మొయిన అలీ, శార్దుల్ ఠాకూర్, కేన్ విలియమ్సన్, కేశవ్ మహారాజ్, డారీ మిచెల్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా నేడు వేలంలోకి అమ్ముడుపోలేదు. అందరూ ఆటగాళ్లు అయిపోయిన తరువాత మరోసారి అన్‌సోల్డ్ ప్లేయర్లను వేలంలోకి తీసుకువస్తారు. అప్పుడు కూడా ఏ ఫ్రాంచైజీ తీసుకుంటే వాళ్ల పంట పడినట్లే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.