IPL 2023 Updates: KKR, RCB జట్లలో కీలకమార్పులు.. రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా..

IPL 2023 KKR vs RCB: కోల్‌కతా వేదికగా ఐపీఎల్ 2023లో 9వ మ్యాచ్ ఇవాళ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగనుంది. గాయాలతో ఇవాళ్టి మ్యాచ్‌కు ఆటగాళ్లు  దూరమవడం రెండు జట్లకు సమస్యగా మారింది. రెండు జట్ల ప్లేయింగ్ 11 అంచనాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 8, 2023, 11:00 AM IST
  • ఈడెన్ గార్డెన్ వేదికగా ఐపీఎల్ 2023 9వ మ్యాచ్‌లో తలపడనున్న కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ
  • గాయాాల కారణంగా ఇరు జట్ల నుంచి కీలక ఆటగాళ్లు దూరం
  • కేకేఆర్, ఆర్సీబీ ప్లేయింగ్ 11 అంచనాలు ఇవే
IPL 2023 Updates: KKR, RCB జట్లలో కీలకమార్పులు.. రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా..

IPL 2023 KKR vs RCB: ముంబై ఇండియన్స్‌పై ఘన విజయంతో ఉత్సాహంతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇవాళ ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్‌తో తలపడనుంది. ఈ ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇది 9వ మ్యాచ్. ఇరుజట్లకు ఆటగాళ్ల గాయాలు సమస్యగా మారడంతో ప్లేయింగ్ 11 ఎవరెవరు ఉంటారనేది ఆసక్తి కల్గిస్తోంది. 

ఆతిధ్యమిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో గాయం కారణంగా ప్రధాన బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమౌతున్నాడు. షకీబ్ అల్ హసన్ కూడా వ్యక్తిగత కారణాలతో వైదొలిగాడు. ఇక ఆర్సీబీ నుంచి కీలకమైన పేస్ బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్, రీస్ టోప్లేలు ఆడటం లేదు. కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా నేతృత్యవంలో కేకేఆర్ జట్టు ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింక్స్ చేతిలో 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. శ్రేయస్ అయ్యర్ స్థానంలో ఇంగ్లండ్ బ్యాటర్ జేసన్ రాయ్‌ను తీసుకున్నా..అహ్మదాబాద్ మ్యాచ్ కంటే ముందు జట్టులో చేరే పరిస్థితి లేదు.

మరోవైపు ఆర్సీబీ రీస్ టోప్లే స్థానంలో ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ విల్లీను తీసుకుంది. రీస్ టోప్లేను ఐపీఎల్ 2023 వేలంలో ఆర్సీబీ 1.9 కోట్లకు కొనుగోలు చేసింది. బెంగళూరులో ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో జోష్ హేజిల్‌వుడ్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో భుజం డిస్‌లొకేట్ అయింది.

డేవిడ్ విల్లీ టోప్లేకు సరైన ప్రత్యామ్నాయంగా ఆర్సీబీ భావిస్తోంది. ఎందుకంటే లెఫ్ ఆర్మ్ పేసర్‌తో పాటు లోయర్ డౌన్ ఆర్డర్‌లో మంచి బ్యాటర్ కూడా. ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ఉపయోగించుకోలేదు. అయినా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెకెండ బ్యాటింగ్ దిగే పరిస్థితి ఉంటే ఆర్సీబీలో ఆకాష్ దీప్ లేదా మొహమ్మద్ సిరాజ్ స్థానంలో సుయాష్ ప్రభుదేశాయ్ లేదా అనూజ్ రావత్ చేరవచ్చు. ఇక కేకేఆర్ విషయానికొస్తే..శార్ధూల్ ఠాకూర్ స్థానంలో కుల్వంత్ ఖెజ్రోలియాను తీసుకోవచ్చు. వెంకటేశ్ అయ్యర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా వినియోగించే అవకాశముంది. 

కోల్‌కతా నైట్ రైడర్స్

మణిదీప్ సింగ్, రహమానుల్లా గుర్బాజ్, అనుకూల్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్ధూల్ ఠాకూర్ లేదా కుల్వంజ్ ఖెజ్రోలియా, ఉమేష్ యాదవ్, టిమ్ సోథీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మైకేల్ బ్రేస్‌వెల్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, డేవిడ్ విల్లీ, కర్న్ శర్మ

Also Read: RR vs PBKS Match Highlights: రాజస్థాన్‌, పంజాబ్ మ్యాచ్‌లో చివరి వరకు తప్పని సస్పెన్స్.. చివరి ఓవర్లో మారిన ఫలితం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News