Arjun Tendulkar: అర్జున్‌ టెండూల్కర్‌కు కుక్కకాటు.. నెట్టింట వీడియో వైరల్

LSG Vs MI Match Updates: ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్‌ను కుక్క కరించింది. ఈ విషయాన్ని స్వయంగా అర్జున్ వెల్లడించాడు. లక్నో మ్యాచ్‌కు ప్రాక్టీస్ సందర్భంగా తనకు కుక్క కరిచినట్లు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : May 16, 2023, 06:25 PM IST
Arjun Tendulkar: అర్జున్‌ టెండూల్కర్‌కు కుక్కకాటు.. నెట్టింట వీడియో వైరల్

LSG Vs MI Match Updates: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు నేడు కీలక పోరుకు సిద్ధమవుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువ అవుతుంది. ప్రస్తుతం ముంబై పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో ఉండగా.. లక్నో నాలుగో స్థానంలో ఉంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇక ఈ మ్యాచ్‌కు ముందు సచిన్ టెండూల్కర్ తనయుడు, ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ తనను కుక్క కరిచిందని చెప్పాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

తన స్నేహితుడు యుధ్వీర్ సింగ్ చరక్‌తో అర్జున్ టెండూల్కర్ మాట్లాడుతూ.. తనను కుక్క కరిచిందని తెలిపాడు. గతంలో యుధ్వీర్ సింగ్ చరక్ ముంబై ఇండియన్స్ తరపున ఆడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి యుధ్వీర్ సింగ్‌తో అర్జున్‌కు మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. యుధ్వీర్‌తో మాట్లాడుతూ.. తనకు కుక్క కరిచిందని ఎడమ చేతిని చూపించాడు. యుధ్వీర్‌తో మాట్లాడిన అనంతరం మొహ్సిన్ ఖాన్‌తో కూడా మాట్లాడాడు. ఎలా ఉన్నావు బ్రదర్ అని అడగ్గా.. అంతా గుడ్ అని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. 

 

ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అర్జున్ టెండూల్కర్.. నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. ఈ 4 మ్యాచ్‌ల్లో  3 వికెట్లు పడగొట్టాడు. అయితే బ్యాటింగ్‌ చేసే అవకాశం అంతగా రాలేదు. ఓ మ్యాచ్‌లో సిక్సర్‌తో అలరించాడు. ప్లే ఆఫ్ రేసులో ముంబై ఉండడంతో అర్జున్‌కు తుది జట్టులో ఛాన్స్ రాకపోవచ్చు. ప్లేయింగ్ 11లో భాగం కాకపోయినా.. అర్జున్ టెండూల్కర్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 

ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో లక్నోతోపాటు మరో మ్యాచ్‌ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. ప్లే ఆఫ్ బెర్త్ ఫిక్స్ చేసుకోవడంతోపాటు టాప్-2లో నిలుస్తుంది. ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించగా.. 5 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. అదే సమయంలో లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో లక్నో 12 మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఆరింటిలో గెలిచింది. 5 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో లక్నో ఖాతాలో ప్రస్తుతం 13 పాయింట్లు ఉన్నాయి. చివరి రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. ఎలాంటి సమీకరణలతో సంబంధంలేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. 

Also Read: LSG Vs MI Dream11 Team Prediction: ముంబై జోరుకు లక్నో బ్రేకులు వేస్తుందా..? ప్లే ఆఫ్స్ చేరేది ఎవరు..? డ్రీమ్ 11 టీమ్ ఇలా..  

Also Read: CM Jagan Mohan Reddy: హోల్‌సేల్‌గా అమ్ముకునే వ్యక్తి ప్యాకేజీ స్టార్‌.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఓ లెవల్లో ఉంది: సీఎం జగన్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News