KKR Batter Rinku Singh Touches RCB Captain Virat Kohli in IPL 2023: టీమిండియా మాజీ కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా, బౌలర్ ఎవరైనా, మైదానం ఎలాంటిదైనా.. కింగ్ క్రీజులో ఉన్నాడంటే పరుగుల వరద పారాల్సిందే. కోహ్లీ తన అద్భుత బ్యాటింగ్‌తో విదేశీ గడ్డపై భారత జెండా రెపరెపలాడిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. తన కెరీర్‌లో టీమిండియాకు అందించిన విజయాలను చూస్తే.. కోహ్లీ గెలవడానికే పుట్టాడని, గెలిపించడానికే జట్టులో ఉన్నాడని, ఇంకా గెలిపిస్తూనే ఉంటాడని అనిపిస్తుంది. కోహ్లీకి భారత దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఫాన్స్ ఉన్నారు.
విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకుని క్రికెట్‌ను కెరీర్‌గా మొదలపెట్టిన ఎందరో యువ ఆటగాళ్లు ఉన్నారు. తన ఆరాధ్య దైవంను కనీసం ఒక్కసారి అయినా కలవాలని చాలా మంది అనుకుంటారు. ఈ జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ రింకూ సింగ్ కూడా ఉన్నాడు. ఐపీఎల్ పుణ్యమాని రింకూ కోరిక తీరింది. అంతేకాదు కోహ్లీపై తనకు ఉన్న అభిమానాన్ని రింకూ చాటుకున్నాడు. తన ఆరాధ్య దైవం విరాట్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఐపీఎల్ 2023లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
బుధవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జజరిగింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత డగౌట్‌కు వెళ్లే సమయంలో విరాట్ కోహ్లీ పాదాలను రింకూ సింగ్ టచ్ చేసి ఆశీర్వాదం తీసకున్నాడు. వెంటనే కోహ్లీ రింకూని లేపి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోస్ చూసి కోహ్లీ ఫాన్స్ అందరూ ఖుషి అవుతున్నారు. 'కింగ్ కోహ్లీ' అంటే అదే మరి అని ఒకరు ట్వీట్ చేయగా.. 'కోహ్లీ క్రేజ్ మాములుగా ఉండదు' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.
ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 21 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 రన్స్ చేసింది. జేసన్ రాయ్ (56; 29 బంతుల్లో 4×4, 5×6), నితీశ్ రాణా (48; 21 బంతుల్లో 3×4, 4×6) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో హసరంగా, విజయ్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. ఛేదనలో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులే చేయగలిగింది. విరాట్ కోహ్లీ (54; 37 బంతుల్లో 6×4), మహిపాల్ లొమ్రార్ (34; 18 బంతుల్లో 1×4, 3×6) సత్తాచాటినా ఓటమి తప్పలేదు. వరుణ్ చక్రవర్తి (3/27) బెంగళూరును దెబ్బకొట్టాడు. 8 మ్యాచ్‌ల్లో కోల్‌కతా మూడో విజయం సాధించగా.. బెంగళూరు నాలుగో ఓటమిని ఖాతాలో వేసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.