CSK player Ravindra Jadeja trolls KKR over MS Dhoni's picture: టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja).. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీల్లో ఒకటైన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు అదిరే పంచ్ ఇచ్చాడు. 'అది మాస్టర్ స్ట్రోక్ కాదు. కేవలం షో ఆఫ్ అంటూ' అంటూ కోల్‌కతా గాలి తీశేశాడు. ఆదివారం కేకేఆర్ ప్రాంచైజీ టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని ఉద్దేశించి ఓ పోస్టు చేయగా.. జడ్డూ దానికి కౌంటర్ ఇచ్చాడు. అసలు విషయంలోకి వెళితే...
సిడ్నీ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా (ENG vs AUS) జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టు ఆదివారం 'డ్రా'గా ముగిసింది. చివరి క్షణాల్లో ఇంగ్లండ్ ఆఖరి వికెట్ కాపాడుకొని (స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్) ఈ మ్యాచ్‌లో ఓటమిపాలవ్వకుండా గట్టెక్కింది. ముఖ్యంగా బ్రాడ్ డిఫెన్స్ ఆడుతూ ఇంగ్లీష్ జట్టును ఆదుకున్నాడు. బ్రాడ్ వికెట్ తీసేందుకు ఆసీస్ బౌలర్లు గట్టి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) కట్టుదిట్టమైన ఫీల్డింగ్ సెట్ చేశాడు. ఫీల్డర్లు అందరినీ బ్యాటర్ చుట్టూనే ఏర్పాటు మోహరించాడు. దీంతో ఎలాగైనా వికెట్ సాధించాలని చూశాడు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది.
మరోవైపు ఐపీఎల్‌లో గౌతమ్ గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు.. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ (Rising Pune Supergiant) తరఫున బ్యాటింగ్ చేస్తున్న ఎంఎస్ ధోనీకి అచ్చం ఇలాంటి ఫీల్డింగే సెట్ చేశాడు. ధోనీని కట్టడి చేయాలని చుట్టూ నలుగురు ఫీల్డర్లను మోహరించాడు. ఆ మ్యాచ్‌లోని సన్నివేశం.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ సన్నివేశం దాదాపుగా ఒకే రీతిలో ఉండడంతో కేకేఆర్ సరదాగా ఆటపట్టిందామని ఓ ట్వీట్ చేసింది. అప్పటి ధోనీ ఫొటోతో సహా తాజా మ్యాచ్‌లోని బ్రాడ్-ఆండర్సన్‌కు ఏర్పాటు చేసిన ఫీల్డింగ్ ఫొటోను ట్విటర్‌లో పంచుకుంది. 'టెస్టుల్లో క్లాసిక్ సన్నివేశం.. మీకు టీ20ల్లో మాస్టర్ స్ట్రోక్‌ను గుర్తు చేస్తే ఇలా ఉంటుంది' అని కేకేఆర్ పేర్కొంది.
Its not a master stroke!Just a show off🤣
— Ravindrasinh jadeja (@imjadeja) January 9, 2022
కేకేఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ట్వీట్ చూసిన చెన్నై ప్లేయర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja Trolls KKR) తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. 'అది మాస్టర్ స్ట్రోక్ కాదు. కేవలం షో ఆఫ్' అంటూ నవ్వుతున్న ఎమోజీ జత చేశాడు. మరోవైపు పలువురు ధోనీ అభిమానులు కూడా కేకేఆర్ టీమ్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు పోస్టులు మీమ్స్ షేర్ చేస్తూ కేకేఆర్‌ను ఆడుకుంటున్నారు. ఇక ఐపీఎల్ 2021 (IPL) ఫైనల్లో కోల్‌కతాను ఓడించిన చెన్నై నాలుగోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
Also Read: Antigen Test Kit Procedure: కరోనా లక్షణాలతో బాధపడుతున్నారా? ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోండిలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook