కరోనా వైరస్ కారణంగా యూఏఈ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో పరుగుల వరద పారింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఐదో పర్యాయం ఐపీఎల్ ట్రోఫీని సాధించింది. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆరుగురు బ్యాట్స్‌మెన్ 500కు పైగా పరుగులు చేయడం విశేషం. ఫైనల్‌కు చేరిన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల నుంచి ఇద్దరు చొప్పున ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు.
IPL 13 లీగ్ దశలోనే పంజాబ్ జట్టు నిష్క్రమించినప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2020 ఆరెంజ్ క్యాప్ సాధించాడు. ఈ సీజన్‌లో పరుగుల వరద (670 పరుగుల; 14 మ్యాచుల్లో) పారించిన క్రికెటర్‌గా రాహుల్ నిలిచాడు. భారత మరో ఓపెనర్ శిఖర్ ధావన్ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లలో డకౌట్ అయినప్పటికీ 17 మ్యాచుల్లో 618 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ 13లో 600 పైచిలుకు పరుగులు సాధించిన ఇద్దరు క్రికెటర్లు వీరే.
- Also Read : Rohit sharma Selected for Australia Tour: టీమిండియా నుంచి రోహిత్ శర్మకు పిలుపు.. కానీ ఒక్క ఛాన్స్!
IPL 2020 Leading Run Scorer List
కేఎల్ రాహుల్ - 14 మ్యాచుల్లో 670 పరుగులు
శిఖర్ ధావన్ - 17 మ్యాచుల్లో 618 పరుగులు
డేవిడ్ వార్నర్ - 16 మ్యాచుల్లో 548 పరుగులు
శ్రేయస్ అయ్యర్ - 17 మ్యాచుల్లో 519 పరుగులు
ఇషాన్ కిషన్ - 14 మ్యాచుల్లో 516 పరుగులు
క్వింటన్ డికాక్ - 16 మ్యాచుల్లో 503 పరుగులు
ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ 191.42తో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ను సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ ఆర్చర్ 179.36 స్ట్రైక్ రేట్, ముంబై ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 179.98 స్ట్రైక్ రేట్, చెన్నై ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 171.85 స్ట్రైక్ రేట్‌తో టాప్ 5 స్థానాలు దక్కించుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe