Padma Award 2025 for Sports: మాజీ క్రికెటర్ రవిచంద్రన్‌ అశ్మిన్‌కు పద్మ అవార్డు

Padma Award 2025 for Sports: 2025 సంవత్సరానికి గాను పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. క్రీడా ప్రపంచానికి సంబంధించి ఐదుగురు దిగ్గజాల పేర్లు జాబితాలో ఉన్నాయి. ఇందులో పీఆర్ శ్రీజేస్, టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్లు ఉన్నాయి.   

Written by - Bhoomi | Last Updated : Jan 25, 2025, 10:31 PM IST
Padma Award 2025 for Sports: మాజీ క్రికెటర్ రవిచంద్రన్‌ అశ్మిన్‌కు పద్మ అవార్డు

Padma Award 2025 for Sports:  భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025కి పద్మ అవార్డులను ప్రకటించింది.క్రీడా ప్రపంచానికి సంబంధించిన ఐదుగురు దిగ్గజాల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  ఇందులో ప్రముఖంగా పిఆర్ శ్రీజేష్, రవిచంద్రన్ అశ్విన్ పేర్లు వినిపిస్తున్నాయి. భారత పురుషుల హాకీ జట్టు మాజీ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌కు పద్మభూషణ్‌ వరించింది. టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్. అశ్విన్‌కు పద్మశ్రీ అవార్డు లభించింది. పారిస్ పారాలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆర్చర్ హర్విందర్ సింగ్‌ను కూడా పద్మశ్రీ వరించింది. భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ ఐఎం విజయన్, ప్రముఖ పారా అథ్లెటిక్స్ కోచ్ సత్యపాల్ సింగ్‌లు పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. 

గతేడాది పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత పురుషుల హాకీ జట్టుకు కాంస్య పతకాన్ని గెలుచుకోవడంలో పీఆర్ఎ శ్రీజేష్ కీలక పాత్ర పోషించారు. భారత జట్టు కాంస్యం సాధించిన టోక్యో ఒలింపిక్స్ లో శ్రీజేష్ కూడా భాగమయ్యాడు. పారిస్ ఒలింపిక్స్ ముగియడంతో శ్రీజేష్ హాకీకి వీడ్కోలు పలికాడు. 

Also Read: Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్..  

రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ కు చేసిన సేవలకు గాను పద్మశ్రీ అవార్డు లభించింది. ఈ ఆఫ్ స్పిన్నర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.

Also Read: Padma Awards 2025: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News