PV Sindhu: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమిషన్ ఎన్నికల్లో పోటీపడనుంది. ఈ ఎన్నికలు స్పెయిన్(Spain)లో డిసెంబరు 17న జరుగుతాయి. అథ్లెట్స్ కమిషన్‌లో ఆరు స్థానాలు ఉండగా 9 మంది క్రీడాకారుల్ని పోటీపడనున్నారు. అథ్లెట్స్ కమిషన్ సభ్యులు 2021 నుంచి 2025 వరకు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా ఉన్న సింధు మరోసారి ఎన్నికల్లో బరిలోకి దిగుతుంది. 2017లో తొలిసారిగా సింధు అథ్లెట్స్ కమిషన్‌కు ఎంపికైంది. ‘‘ప్రస్తుత అథ్లెట్స్ కమిషన్ నుంచి సింధు ఒక్కరే మరోసారి ఎన్నికల్లో బరిలో దిగుతుంది.
Also Read: Big Controversy on BCCI: ఆటగాళ్లకు హలాల్ మాంసం..పంది, గొడ్డు మాంసం నిషేధం..సోషల్ మీడియాలో దుమారం
అథ్లెట్స్ కమిషన్‌కు ఎంపికైన సభ్యులు ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు. అనంతరం అథ్లెట్స్ కమిషన్ ఛైర్మన్‌ను బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్(BWF Council)లోకి తీసుకుంటారు. సింధుతో పాటు గ్రేసియా పోలి (ఇండోనేసియా), ఆడమ్ హాల్ (స్కాట్లాండ్), హదియా హోస్నీ (ఈజిప్ట్), ఐరిస్ వాంగ్ (అమెరికా), కిమ్ సోయెంగ్ (కొరియా), రాబిన్ టేబిలింగ్ (నెదర్లాండ్స్), సొరాయ (ఇరాన్), జెంగ్ వీ (చైనా)లు అథ్లెట్స్ కమిషన్ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. ఇక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) ‘'బిలీవ్ ఇన్ స్పోర్ట్స్' కార్యక్రమానికి ప్రచారకర్తగా నియమితులయ్యే వారిలో సింధు పేరు కూడా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook