ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) 57 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. అయితే ముంబై జట్టుకి ఆరో ఫైనల్. రోహిత్ శర్మ (Rohit Sharma)కు సైతం ఐపీఎల్‌లో ఆరో ఫైనల్. అయితే దక్కన్ ఛార్జర్స్ తరఫున 2009లో ఫైనల్ ఆడిన రోహిత్ శర్మ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఆ తర్వాత రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు.
రోహిత్ శర్మ జట్టుతో చేరక ముందే సచిన్ టెండూల్కర్ కెప్టె్న్సీ 2010లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఫైనల్లో ఓటమి పాలైంది. ఈ రెండు మ్యాచ్‌లలో రోహిత్ శర్మ కెప్టెన్ కాదు. అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన ముంబై జట్టు ప్రతీసారి టైటిల్ సాధించింది. 2013, 2015, 2017 మరియు 2019 సీజన్లలో విజేతగా నిలిచింది. అయితే ఆ 4 సందర్భాలలో ఫైనల్స్‌లో ప్రత్యర్థి జట్టులో ఎంఎస్ ధోనీ ఉండటం గమనార్హం.
2013, 15, 19లో ఫైనల్లో ముంబై జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడింది. అంటే ధోనీ కెప్టెన్సీలోని జట్టుపై నెగ్గి రోహిత్ ఈ 3 ఐపీఎల్ టైటిల్స్ సాధించాడు. 2017లో ఫైనల్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌పై రోహిత్ శర్మ టీమ్ తలపడింది. ఆ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో పుణే జట్టుకు ధోనీ ఆడాడు. అంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై జట్టు కప్పు నెగ్గిన ప్రతి సందర్బంలోనూ ప్రత్యర్థి జట్టులో ధోనీ ఉన్నాడు. తొలిసారి ధోనీ లేకుండా రోహిత్ శర్మ ఐపీఎల్ ఆడబోతున్నాడు. ఈ సీజన్‌లో చెన్నై లీగ్ దశకే ఇంటిదారి పట్టింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe