BCCI receives fake applications from MS Dhoni, Sachin Tendulkar for BCCI Job: టీ20 ప్రపంచకప్ 2022 అనంతరం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దిద్దుబాటు చర్యలకు దిగిన విషయం తెలిసిందే. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని బీసీసీఐ తొలగించింది. ఆపై మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ కూడా జట్టుకు దూరమయ్యాడు. ఇక గత నెలలోనే కొత్త సెలక్షన్ కమిటీ నియామకం కోసం బీసీసీఐ దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. సెలక్షన్ కమిటీలో చోటు కోసం బీసీసీఐకి వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇందులో స్వదేశీయులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు.
ఐదుగురు సభ్యుల సెలక్షన్ ప్యానెల్ కోసం బీసీసీఐకి 600కు పైగా ఈ-మెయిల్ దరఖాస్తులు అందాయి. అయితే బీసీసీఐకి వచ్చిన దరఖాస్తుదారుల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వంటి సీనియర్ల పేర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హాక్ పేరు కూడా ఉంది. క్రికెట్ చరిత్రలో లెజెండ్స్‌గా పేరుగాంచి వీరి పేర్లు చూసి బీసీసీఐ అధికారులు ఆశ్చర్యపోయారు. నిజంగానే బీసీసీఐ సెలక్షన్ కమిటీ పదవి కోసం వీరు అప్లై చేసుకున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు.
సెలక్షన్ కమిటీ అభ్యర్థుల బయో డేటాను బీసీసీఐ అధికారులు చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. ఈ అప్లికేషన్స్‌లు ఫేక్ ఈమెయిల్ ఐడీతో వచ్చినట్లు గుర్తించారు. దాంతో ఈ విషయం భారత క్రికెట్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ మ్యాటర్ వైరల్ అయింది. 'దాదాపుగా 600 దరఖాస్తులు అందాయి. అందులో ఎంఎస్ ధోనీ, వీరేందర్ సెహ్వాగ్ మరియు సచిన్ టెండూల్కర్ పేర్లు ఉన్నాయి. అవి నకిలీ ఐడిల నుంచి వచ్చాయని తర్వాత గుర్తించాం. కొందరు ఇలా చేసి బీసీసీఐ సమయాన్ని వృథా చేస్తున్నారు' అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
600 దరఖాస్తుల నుంచి క్రికెట్ సలహా కమిటీ (CAC) 10 పేర్లను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. షార్ట్ లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూ చేస్తారు. నేరుగా లేదా ఆన్ లైన్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారు. 10 మంది అభ్యర్థులలో సెలక్షన్ ప్యానెల్ కోసం ఐదుగురిని ఎంపిక చేస్తుంది. భారత జట్టుకు ఆడిన ఆటగాళ్లకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని బీసీసీఐ చూస్తోందట. ఇక కొత్త సెలక్షన్ కమిటీ నియామకం కోసం ఇప్పటికే ఆలస్యం అయింది. దరఖాస్తుల చివరి గడువు దాటి ఇప్పటికే నెల రోజులు పూర్తయ్యాయి.
Also Read: IPL 2023 Auction: నేడే ఐపీఎల్ 2023 మినీ వేలం.. వేదిక, టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
Also Read: Gold Price Today: 55 వేల చేరువలో బంగారం ధర.. 70 వేలు దాటిన వెండి ధర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.