Saina Nehwal vs Jasprit Bumrah: ఒలింపిక్స్ వేళ మళ్లీ దేశంలో క్రీడా రంగంపై చర్చ మొదలైంది. క్రికెట్‌కు ఉన్నంత ప్రాధాన్యం ఇతర క్రీడలకు లేకపోవడంతో ఒలింపిక్స్‌లో భారత్ ప్రదర్శన పేలవంగా ఉందని.. చిన్న దేశాలతో పోలిస్తే భారత్‌కు డబుల్ డిజిట్ మెడల్స్ రావడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే భారత మాజీ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ స్పందించారు. మరోసారి క్రికెట్‌పై విమర్శలు చేస్తూనే.. ఇతర క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో స్టార్ స్పిన్నర్ జస్ప్రీత్ బుమ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ నాతో బుమ్రా ఆడితే మాత్రం దెబ్బకు అడ్డం పడతాడని సంచలన ప్రకటన చేశారు.
Also Read: Paris Olympics 2024: భారత్‌కు ఐదో కాంస్యం.. రెజ్లింగ్‌లో అమన్ సెహ్రవత్‌కు మెడల్
పారిస్ ఒలింపిక్స్ క్రీడల నేపథ్యంలో జర్నలిస్ట్, యూట్యూబర్ శుభాంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో సైనా నెహ్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలో క్రీడల పరిస్థితి.. తన కెరీర్.. పారిస్ ఒలింపిక్స్ వంటి విషయాలపై సైనా మాట్లాడారు. దేశంలో ఇతర క్రీడలకు తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు, ప్రోత్సాహం అందిస్తే ఒలింపిక్స్‌లో భారతదేశం సత్తా చాటుతుందని పేర్కొన్నారు.
Also Read: Arshad Nadeem: గోల్డెన్ బాయ్ ఒక మేస్త్రీ కొడుకు.. చందాలతో ఒలింపిక్స్‌లో చరిత్రను తిరగరాశాడు
'దేశంలో క్రికెట్‌కు ఉన్నంత ఆదరణ.. గౌరవం ఇతర క్రీడలకు లేదు. ఇది చేదు విషయం. సంపాదన.. గౌరవంలో ఇతర క్రీడాకారులు క్రికెటర్లకు దారిదాపుల్లో కూడా లేరు. ఈ విషయంలో క్రికెటర్లపై గతంలో చాలాసార్లు ఇతర క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేశారు. క్రికెటర్లకు ఉన్నంత గుర్తింపు ఇతరులకు లేదు' అని సైనా తెలిపారు. క్రికెటర్లకు అందిస్తున్న సౌకర్యాల విషయమై సైనా నెహ్వాల్ నిలదీశారు.
మాలాగా కావాలని కోరుకోరు
పారిస్ ఒలింపిక్స్‌పై స్పందిస్తూ.. 'మన దేశంలో క్రికెట్‌కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. క్రికెటర్లకు అందిస్తున్నట్టు ఆర్థిక సహకారం, సౌకర్యాలు ఇతర క్రీడలకు అందించడం లేదు. క్రికెట్ మాదిరి ఇతర క్రీడలకు సౌకర్యాలు కల్పిస్తే ఒలింపిక్స్‌లో భారత్ ప్రదర్శన మెరుగవుతుంది. అమెరికా, చైనా మాదిరి పతకాలు సాధించే అవకాశం ఉంది' అని సైనా తెలిపారు. 'ఇవాళ ప్రతి ఒక్కరూ క్రికెట్, ఫుట్‌బాల్ ఆడాలనుకుంటున్నారు. విరాట్ కోహ్లీ, సచిన్‌లా కావాలని అనుకుంటున్నారు. కానీ ఎవరూ కూడా శ్రీకాంత్ కిడాంబి, పుల్లెల గోపీచంద్, పీవీ సింధులాగా అవ్వాలని కోరుకోవడం లేదు' అని వివరించారు.
బుమ్రా తట్టుకోలేడు
'ఐపీఎల్‌లో ఓ క్రికెటర్ చక్కటి ప్రదర్శన కనబరిస్తే తర్వాతి సీజన్‌లో రూ.5- 6 కోట్లు పలుకుతాడు. 'నేను కనుక క్రికెట్ ఆడాలనుకుంటే.. జస్ప్రీత్ బుమ్రా 150 స్పీడ్‌కు చావాలనుకోను. అదే విధంగా బుమ్రా నాతో బ్యాడ్మింటన్ ఆడితే.. నేను 300 స్పీడ్‌తో స్మాష్ చేస్తే బుమ్రా కోలుకోలేడు. దెబ్బకు అడ్డం పడతాడు' అని సైనా నెహ్వాల్ వెల్లడించారు. 'రెండు ఆటలు వేరు. క్రికెట్ ఆట నైపుణ్యంతో కూడుకున్నది కాగా బ్యాడ్మింటన్ శక్తితో కూడుకున్నది' అని సైనా తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter