టీమిండియాకు భారీ షాక్.. వరల్డ్ కప్‌లోంచి శిఖర్ ధావన్ ఔట్!

టీమిండియాక్ భారీ షాక్.. వరల్డ్ కప్‌లోంచి ధావన్ ఔట్!

Last Updated : Jun 20, 2019, 12:14 AM IST
టీమిండియాకు భారీ షాక్.. వరల్డ్ కప్‌లోంచి శిఖర్ ధావన్ ఔట్!

ప్రపంచ కప్ పర్యటనలో వున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. బొటన వేలి గాయంతో బాధపడుతున్న శిఖర్ ధావన్ తొలుత కొన్ని మ్యాచ్‌లకి దూరం కాక తప్పదని భావించినప్పటికీ.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అతడు ఈ టోర్నమెంట్ నుంచే ఔట్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే న్యూజీలాండ్, పాకిస్తాన్ జట్లతో మ్యాచ్‌లకు ధవన్ దూరంగా ఉండగా అతడి స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, శిఖర్ ధావన్ స్థానంలో రిషబ్ పంత్‌తో భర్తీ చేయాలని భావించిన బీసీసీఐ అతడిని హుటాహుటిన ఇంగ్లండ్ రప్పించుకుంది. 

ఆస్ట్రేలియాతో ఆడిన లీగ్ మ్యాచ్‌లో ఆసిస్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ వేసిన బంతి తగలడంతో ధావన్ వేలికి గాయమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆటకు దూరంగా వున్న శిఖర్ ధావన్ ఆ తర్వాత సెమీ ఫైనల్స్ వరకైనా కోలుకుంటాడని భావిస్తున్నట్టు టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ ఆశాభావం వ్యక్తంచేశాడు. కానీ అటు ధావన్ అభిమానులను, ఇటు టీమిండియా ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తూ అతడిని గాయం కారణంగా జట్టులోంచి పక్కకు పెట్టినట్టు తెలుస్తోంది.

Trending News