BWF World Tour Finals 2021: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu).. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్(World Tour Finals)లో తుది పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్ మ్యాచ్ లో జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచిపై గెలుపొంది.. ఫైనల్లోకి ప్రవేశించింది సింధు. నువ్వా-నేనా అన్నట్లు సాగిన పోరులో చివరకు సింధునే పైచేయి సాధించింది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత యమగుచి(Akane Yamaguchi)పై 21-15 15-21 21-19 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ సుమారు డెబ్బై నిమిషాల పాటు జరిగింది.
Also Read: BWF World Tour Finals: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు
అయితే ఫైనల్‌లో సింధు... దక్షిణ కొరియా ప్లేయర్ సెయంగ్‌తో తలపడనుంది. ఇక ఈ టోర్నీలో మరో భారత ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్(Srikanth) గ్రూప్-బి చివరి మ్యాచ్‌లో ఓటమి పాలై సెమీ ఫైనల్ కూడా చేరకుండానే నిష్క్రమించాడు. వరల్డ్ టూర్ ఫైనల్స్ తుదిపోరుకు చేరడం సింధు(PV Sindhu)కు ఇది మూడోసారి. 2018లో సింధు ఈ టైటిల్ గెలుచుకుంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు ముందు పీవీ సింధు.. ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఇండోనేసియా ఓపెన్‌లో సెమీస్ వరకు మాత్రమే చేరుకోగలిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook