South Africa vs Sri Lanka World Cup 2023 Highlights: వన్డే వరల్డ్ కప్‌ను దక్షిణాఫ్రికా విజయంతో ఆరంభించింది. శ్రీలంకతో జరిగిన తొలి పోరులో సఫారీ 102 పరుగుల తేడాతో చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లు ముగ్గురు సెంచరీలు బాదడం విశేషం. ఐడెన్ మార్క్‌క్రమ్ 49 బంతుల్లో శతకం బాది వన్డే ప్రపంచ కప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీని చేసిన ఆటగాడిగా నిలవగా.. క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ కూడా శతకాలు బాదారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 428పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. ప్రపంచకప్‌లో రేపు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు జరగనుంది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా.. కెప్టెన్ బవూమా (8) విఫలమైనా మిగిలిన బ్యాట్స్‌మెన్లు చిత్తకొట్టారు. ఓపెనర్ క్వింటన్ డి కాక్ (100), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (108), ఐడెన్ మార్క్రామ్ (106) మెరుపులతో 50 ఓవర్లలో 5 వికెట్లకు 428 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక జట్టు స్కోరు కావడం విశేషం. అదేవిధంగా వరల్డ్ కప్‌లో తొలిసారిగా ఒక జట్టు నుంచి ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు సెంచరీ మార్క్ చేరుకున్నారు.
వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు ఐడెన్ మార్క్‌రామ్. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. గతంలో 50 బంతుల్లో సెంచరీ చేసిన ఐర్లాండ్‌కు చెందిన కెవిన్ ఓబ్రియన్ పేరిట ఈ రికార్డు ఉంది. 2011 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై ఓబ్రియన్ ఈ రికార్డు నెలకొల్పాడు.
భారీ లక్ష్యాన్ని ఛేదనకు బరిలోకి దిగిన శ్రీలంక.. రెండో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక డకౌట్ అయ్యాడు. కుశాల్ పెరీరా (7) కూడా విఫలమయ్యాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండిస్ మాత్రం కాసేపు సఫారీ బౌలర్లను బెంబెలేత్తించాడు. 42 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. చరిత అసలంక (79), కెప్టెన్ దసున్ షనక (68) దూకుడుగా ఆడినా.. లక్ష్యం పెద్దది కావడంతో పోరాటం సరిపోలేదు. 44.5 ఓవర్లలో 326 పరుగుల వద్ద శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. వేగంగా ఆడే క్రమంలో శ్రీలంక వరుస వికెట్లు కోల్పోయింది. మెరుపు వేగంతో సెంచరీ చేసిన మార్క్‌క్రమ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read: Shubman Gill: తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఆడనున్నాడా..? రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి